అన్వేషించండి

Vivo X100 Series: కెమెరాలే అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా వచ్చిన వివో ఎక్స్100 సిరీస్ - రేటు వింటే మాత్రం షాకే!

Vivo X100: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

Vivo X100 Pro: వివో ఎక్స్100, వివో ఎక్స్100 ప్రో స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అందించారు. వివో ఎక్స్100 సిరీస్‌లో కెమెరాలు అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా ఉండనున్నాయి. వీటి వెనకవైపు జీస్ బ్రాండెడ్ కెమెరాలు ఉన్నాయి. వివో ఎక్స్100 ప్రోలో సోనీ ఐఎంఎక్స్989 ఒక అంగుళం సైజున్న కెమెరాను అందించారు. వీటిలో 6.78 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేలు ఉన్నాయి.

వివో ఎక్స్100 ధర (Vivo X100 Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వెర్షన్ ధర రూ.63,999గా నిర్ణయించారు. ఇక 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయిన రూ.69,999గా ఉంది. ఆస్టరాయిడ్ బ్లాక్, స్టార్‌గేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

వివో ఎక్స్100 ప్రో ధర (Vivo X100 Pro Price in India)
ఈ ఫోన్‌లో కేవలం 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.89,999గా నిర్ణయించారు. ఆస్టరాయిడ్ బ్లాక్ కలర్‌లో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయింది.

జనవరి 11వ తేదీ నుంచి వీటికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో దీన్ని కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

వివో ఎక్స్100  ప్రో స్పెసిఫికేషన్లు (Vivo X100 Pro Specifications, Features)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.78 అంగుళాల అమోఎల్ఈడీ 8టీ ఎల్టీపీవో కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ వరకు స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. ఆక్టాకోర్ 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. వివో కొత్త వీ3 ఇమేజింగ్ చిప్‌తో వివో ఎక్స్100 ప్రో మార్కెట్లోకి వచ్చింది. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు జీస్ బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక అంగుళం సైజ్ ఉన్న 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్989 సెన్సార్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ జీస్ ఏపీవో సూపర్ టెలిఫొటో కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ టెలిఫొటో కెమెరా 4.3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేయనుంది. ప్రైమరీ షూటర్, టెలిఫొటో కెమెరా 100x డిజిటల్ జూమ్‌ను సపోర్ట్ చేయనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి.

512 జీబీ యూఎఫ్‌ఎఫ్ 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. 5జీ, వైఫై 7, బ్లూటూత్ వీ5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, నావిక్, ఓటీజీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఆథెంటికేషన్ చేయవచ్చు. దీని బ్యాటరీ సామర్థ్యం 5400 ఎంఏహెచ్ కాగా, 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌ కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా, బరువు 225 గ్రాములుగా ఉంది.

వివో ఎక్స్100 స్పెసిఫికేషన్లు (Vivo X100 Specifications, Features)
సిమ్, సాఫ్ట్‌వేర్, డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు ప్రో మోడల్ తరహాలోనే ఉండనున్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనున్నాయి. 16 జీబీ వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, వివో వీ2 చిప్‌లను ఇందులో అందించారు.

ఈ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్920 వీసీఎస్ బయోనిక్ సెన్సార్‌ ఉంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 64 మెగాపిక్సెల్ జీస్ సూపర్ టెలిఫొటో కెమెరా అందించారు. దీని ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్‌గా ఉంది.

ఇందులో 512 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 202 గ్రాములుగా ఉంది.

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Add With Sandeep Reddy Vanga | ధోనితో యానిమల్ రీ క్రియేట్ చేసిన VanGOD | ABP DesamSunita Williams Return to Earth Un Docking Success | స్పేస్ స్టేషన్ నుంచి బయల్దేరిన సునీత | ABP DesamSunita Williams Return To Earth | International Space Station నుంచి బయలుదేరిన సునీతా విలియమ్స్ | ABP DesamSunita Williams Return to Earth Biography | సునీతా విలియమ్స్ జర్నీ తెలుసుకుంటే గూస్ బంప్స్ అంతే| ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Voter Card: ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
ఆధార్‌కు ఓటర్ కార్డు అనుసంధానం - అక్రమాలకు చెక్ పెట్టే దిశగా ఈసీ
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Seema Haider:  ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
ఆడపిల్లకు జన్మనచ్చిన సీమా హైదర్- శుభాకాంక్షలు చెబుతున్న నెటిజన్లు
Nani - Vijay Deverakonda: నాని వర్సెస్ విజయ్ దేవరకొండ... ఫ్యాన్ వార్ మీద దర్శకుడు నాగ్ అశ్విన్
నాని వర్సెస్ విజయ్ దేవరకొండ... ఫ్యాన్ వార్ మీద దర్శకుడు నాగ్ అశ్విన్
Grok: గ్రోక్‌ను ఓ ఆటాడుకుంటున్న తెలుగు నెటిజన్లు - కఠిన ప్రశ్నలకు ఫటాఫట్ ఆన్సర్లు ఇచ్చేస్తోందిగా !
గ్రోక్‌ను ఓ ఆటాడుకుంటున్న తెలుగు నెటిజన్లు - కఠిన ప్రశ్నలకు ఫటాఫట్ ఆన్సర్లు ఇచ్చేస్తోందిగా !
Andhra Pradesh Assembly:  ఎమ్మెల్సీల గ్రూప్ ఫోటో సెషన్లో సరదా ముచ్చట్లు -  వారితో ఫోటో దిగడం తన అదృష్టమన్న చంద్రబాబు
ఎమ్మెల్సీల గ్రూప్ ఫోటో సెషన్లో సరదా ముచ్చట్లు - వారితో ఫోటో దిగడం తన అదృష్టమన్న చంద్రబాబు
Embed widget