Vivo X100 Price Leak: వివో బెస్ట్ ఫోన్ల ధర లీక్ - వచ్చేది కొత్త సంవత్సరంలోనే!
Vivo X100: వివో తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఎక్స్100 సిరీస్ స్మార్ట్ ఫోన్లను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. వీటి ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకైంది.
Vivo X100 Price: వివో ఇటీవలే తన ఎక్స్100 సిరీస్ ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు అదే సిరీస్ ఫోన్లను మనదేశంలో తీసుకురానుంది. జనవరి 4వ తేదీన ఈ సిరీస్ ఫోన్లు భారతదేశంలో లాంచ్ కానున్నాయి. అధికారిక లాంచ్‌కు ఒక వారం ముందు ఈ ఫోన్ల ధరలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ ఫోన్ల ధరలు మనదేశంలో రూ.63,999 నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. వివో ఎక్స్100, ఎక్స్100 ప్రో రెండు ఫోన్లలోనూ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ను అందించారు. ఫోన్ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి.
వివో ఎక్స్100 సిరీస్ ధర
టెక్‌అవుట్‌లుక్ కథనం ప్రకారం... వివో ఎక్స్100 ధర మనదేశంలో రూ.63,999 నుంచి ప్రారంభం కానుంది. ఇది బేస్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక వివో ఎక్స్100 ప్రో ధర రూ.89,999 నుంచి ప్రారంభం కానుందని సమాచారం.
చైనాలో వివో ఎక్స్100 ప్రారంభ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,999 యువాన్లుగా (సుమారు రూ.45,600) నిర్ణయించారు. ఇక వివో ఎక్స్100 ప్రో ధర 4,999 యువాన్ల (సుమారు రూ.57,100) నుంచి ప్రారంభం అవుతోంది. దీన్ని బట్టి చూస్తే మనదేశంలో చాలా ఎక్కువగా వీటి ధర ఉండనుందని తెలుసుకోవచ్చు.
వివో ఎక్స్100, ఎక్స్100 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (చైనా వేరియంట్)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆరిజిన్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై వివో ఎక్స్100 సిరీస్ ఫోన్లు పని చేయనున్నాయి. వీటిలో 6.78 అంగుళాల ఎల్టీపీవో అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, స్క్రీన్ రిజల్యూషన్ 2800 x 1260 పిక్సెల్స్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌పై ఈ రెండు ఫోన్లూ రన్ కానున్నాయి.
ఇక కెమెరాల విషయంలో మాత్రం రెండు ఫోన్లలో పలు మార్పులు చూడవచ్చు. వివో ఎక్స్100లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేసే 64 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందించారు. వివో ఎక్స్100 ప్రోలో మాత్రం ఒక అంగుళం సైజున్న 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 4.3x ఆప్టికల్ జూమ్‌ను సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ లెన్స్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ఈ రెండు ఫోన్లూ 100x జూమ్‌ను సపోర్ట్ చేయడం విశేషం. 8కే వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఈ రెండిట్లో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం రెండు ఫోన్లలోనూ ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
వివో ఎక్స్100 స్మార్ట్ ఫోన్‌లో 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని చూడవచ్చు. వివో ఎక్స్100 ప్రోలో 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న 5400 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా వివో ఎక్స్100 ప్రో సపోర్ట్ చేయనుంది. యూఎస్‌బీ టైప్-సీ జెన్ 3.2 పోర్టు, వైఫై 7, 5జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఈ సిరీస్ ఫోన్లలో ఉన్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!