By: ABP Desam | Updated at : 14 Feb 2022 11:02 AM (IST)
Edited By: Eleti Saketh Reddy
Vivo_T1_5G
వివో టీ1 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, వివో అధికారిక వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోుల చేయవచ్చు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది.
వివో టీ1 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,990గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,990గానూ నిర్ణయించారు. రెయిన్‌బో ఫాంటసీ, స్టార్‌లైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందించనున్నారు.
వివో టీ1 5జీ స్పెసిఫికేషన్లు
వివో టీ1 5జీలో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్695 5జీ ప్రాసెసర్‌పై వివో టీ1 5జీ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టంపై వివో టీ1 5జీ పనిచేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 187 గ్రాములుగా ఉంది.
వివో టీ1 5జీలో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను వివో అందించింది.
బ్లూటూత్ వీ5.1, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. వర్చువల్ గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా అందించారు.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Twitter Gold: గోల్డ్ టిక్కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!
ChatGPT Rival: గూగుల్‌పై చాట్‌జీపీటీ ఎఫెక్ట్ - ఇకపై తామూ ఆ సేవలు అందిస్తామంటున్న సుందర్ పిచాయ్!
WhatsApp Update: వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ - ఈ ఆప్షన్‌తో ఇకపై ఈజీగా కాల్ చేసుకోవచ్చు!
WhatsApp Tips: ఫోన్ టచ్ చేయకుండా వాట్సాప్ కాల్స్, మెసేజ్‌లు చేయటం ఎలా? సీక్రెట్ ట్రిక్ ఇది!
iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!