By: ABP Desam | Updated at : 25 Dec 2021 06:14 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
వివో ఎస్12 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.
వివో ఎస్12 ప్రో స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు 108 మెగాపిక్సెల్, ముందువైపు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలను అందించారు. 4300 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 44W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
వివో ఎస్12 ధర
ఇందులో రెండు స్టోరేజ్ వేరియంట్లు లాంచ్ అయ్యాయి. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,399 యువాన్లుగానూ(సుమారు రూ.40,200), 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,699 యువాన్లుగానూ (సుమారు రూ.43,700) ఉంది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గోల్డ్ రంగుల్లో అందుబాటులో ఉంది.
వివో ఎస్12 స్పెసిఫికేషన్లు
ఇందులో డ్యూయల్ సిమ్ కార్డు స్లాట్ అందించారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆరిజిన్ఓఎస్ ఓషన్ సాఫ్ట్‌వేర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.44 ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 19.8:9గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 91.39గా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది.
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1100 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్‌గా ఉంది. 44W ఫ్లాష్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని బరువు 0.73 సెంటీమీటర్లుగానూ, బరువు 171 గ్రాములుగానూ ఉంది.
ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ కెమెరా రెండిట్లోనూ 4కే వీడియోస్ తీయవచ్చు.
సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ బయోమెట్రిక్ ఫీచర్లను వివో అందించింది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు, యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటో మీటర్ వంటి సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
Smartphone Prices: ప్లీజ్... రేట్లు తగ్గించండి - స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మొబైల్ రిటైలర్ల లెటర్!
Instagram New Feature: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్ - డేటా మరింత సేఫ్ అయ్యేలా!
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే - ఇన్ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
Nudify Apps: అలాంటి యాప్‌లకు పెరుగుతున్న పాపులారిటీ- సంచలనం సృష్టిస్తున్ననివేదిక, !
WhatsApp New Feature: త్వరలో వాట్సాప్ సూపర్ మ్యూజిక్ ఫీచర్ - ఇకపై వీడియో కాల్స్‌లో కూడా!
Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్
Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు
/body>