News
News
వీడియోలు ఆటలు
X

Save AC bills: వేసవిలో ఏసీ బిల్లులు మండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే భారీగా తగ్గించుకోవచ్చు!

వేసవిలో ఎండలు మండుతున్న వేళ ఏసీల వినియోగం బాగా పెరిగింది. ఏసీలను ఎక్కువగా వాడటంతో కరెంటు బిల్లులు సైతం మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ బిల్లు తగ్గించుకునే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

FOLLOW US: 
Share:

గత కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ప్రజలు కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా వీటిని వినియోగిస్తున్నారు. ఎడ తెరిపిలేని వాడకంతో  కరెంటు బిల్లులు తడిచి మోపెడు అవుతున్నాయి. అయితే, ఏసీ బిల్లులు తగ్గాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. వీటిని పాటించడం వల్ల సుమారు 20 నుంచి 30 శాతం వరకు కరెంటు బిల్లులు తగ్గించుకోవచ్చు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..   

ఏసీ బిల్లులు తగ్గేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

1. 24-26 డిగ్రీల సెల్సియస్ మధ్య టెంపరేచర్ ఉండేలా చూడండి  

చాలా మంది AC ఆన్ చేసేటప్పుడు ఉష్ణోగ్రతను వీలైనంత వరకు తగ్గిస్తారు. కానీ, కనిష్ట ఉష్ణోగ్రత దగ్గర ACని పెట్టడం వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి.  ACని కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం ద్వారా మీరు మీ విద్యుత్ బిల్లులో 24% వరకు ఆదా చేసుకోవచ్చు.

2. చల్లని గాలి బయటకు వెళ్లకుండా చూసుకోండి

ఏసీ బిల్లులు తగ్గించాలంటే గదిలోని చల్లని గాలిని బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డోర్ క్లోజ్ చేయడంతో పాటు  శీతలీకరణను ఆప్టిమైజ్ చేయాలి. కిటికీలు మూసి వేయడంతో పాటు వీలైతే కర్టెన్లు లాగాలి. ఇలా చేయడం వల్ల గది వేగంగా చల్లబడుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది.

3. అడపాదడపా స్విచ్ ఆఫ్ చేయండి

గది తగినంతగా చల్లబడిన తర్వాత ACని ఆపివేయడం మంచిది. గది చల్లబడిన తర్వాత, అది కనీసం ఒక గంట పాటు అలాగే ఉంటుంది. కాబట్టి, మీరు ఆ సమయంలో  ACని ఆఫ్‌లో ఉంచగలిగితే,  మీ AC బిల్లు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. 

4. రెగ్యులర్ సర్వీసింగ్ చేయించాలి 

మీ AC ఫిల్టర్‌పై దుమ్ము ధూళి పేరుకుపోవడం వల్ల ఏసీ నుంచి చల్లని గాలి బయటకు రావడం చాలా కష్టం అవుతుంది. ఏసీ మోటార్ మీద ఎక్కువ బర్డెన్ పడే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. అందుకే వీలైనంత వరకు ఎప్పటికప్పుడు డర్టీ ఫిల్టర్‌ను కొత్త దానితో రీప్లేస్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల 10-15% వరకు విద్యుత్ బిల్లులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

5. ఫ్యాన్‌ని ఏసీతో ఆన్ చేయండి

ఏసీ ఆన్ చేసిన కొద్ది సేపటి తర్వాత గది చల్లగా అవుతుంది. ఆ సమయంలో ఏసీ ఆఫ్ చేసి, సీలింగ్ ఫ్యాన్ ను ఆన్ చేయాలి. అప్పుడు గది మొత్తం చల్లగా మారుతుంది. సుమారు గంట పాటు చల్లటి గాలిని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది.  గదిలో ఉష్ణోగ్రత మళ్లీ పెరిగిన తర్వాత ఏసీ ఆన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏసీ బిల్లును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 5 టిప్స్ ఉపయోగించి కరెంటు బిల్లు నుంచి కాస్త ఉపశమనం పొందండి.

Read Also: మీ ఫోన్ పోయిందా? కంగారు పడాల్సిన అవసరం లేదు, అదెక్కడున్నా ఇట్టే కనిపెట్టేయొచ్చు!

Published at : 17 May 2023 02:02 PM (IST) Tags: summer AC tips Power bills AC bills

సంబంధిత కథనాలు

Whatsapp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు - ఇక నంబర్ రివీల్ చేయకుండానే!

Whatsapp: వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్లు - ఇక నంబర్ రివీల్ చేయకుండానే!

Best Prepaid Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు - జియో, ఎయిర్‌టెల్, వీఐ బెస్ట్ ప్లాన్లు!

Best Prepaid Plan: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు - జియో, ఎయిర్‌టెల్, వీఐ బెస్ట్ ప్లాన్లు!

Screen Recording: విండోస్ 11లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా? - కేవలం మూడు క్లిక్‌లతోనే!

Screen Recording: విండోస్ 11లో స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఎలా? - కేవలం మూడు క్లిక్‌లతోనే!

Apple Stores: ఇండియా మీద ఫోకస్ పెట్టిన యాపిల్ - త్వరలో మూడు కొత్త స్టోర్లు!

Apple Stores: ఇండియా మీద ఫోకస్ పెట్టిన యాపిల్ - త్వరలో మూడు కొత్త స్టోర్లు!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

టాప్ స్టోరీస్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?

Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ  బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?