Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!
ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు.
ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ట్విట్టర్ లోగో మార్చేశాడు. కావాలనుకుంటే మీ ట్విట్టర్ ఓపెన్ చేసి చూసుకోండి. లోగో లో ఓ కుక్క ఉంటుంది. ఎస్ డోజ్ ను ట్విట్టర్ లోగో గా మార్చేశారు. ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు కానీ. ట్విట్టర్ లోగో గా ఓ కుక్కను చూసినోళ్లంతా ఇదేందియ్యా ఇది అంటూ పోస్టులు పెడుతున్నారు. డోజ్ అనేది ఓ పాపులర్ ఇంటర్నెట్ మీమ్.
2013 నుంచి బాగా పాపులర్ అయ్యింది ఈ మీమ్. జపాన్ కు చెందిన షిబా ఇను అనే డాగ్ బ్రీడ్ ని ఫన్నీగా చూపిస్తే వచ్చిందే ఈ డోజ్ మీమ్. వాస్తవానికి 2010లోనే ఎవరో ఈ మీమ్ క్రియేట్ చేశారు. కానీ 2013లో వరల్డ్ వైడ్ ఆన్ లైన్ పోల్స్ లో టాప్ మీమ్ గా నిలవటంతో పాప్ కల్చర్ లోకి డోజ్ మీమ్ దూసుకొచ్చింది. బ్రోకెన్ ఇంగ్లీష్ తో సెటైరికల్ గా కొంచెం కంజూస్డ్ గానో లేదా అత్యంత అమాయకత్వంతోనో ఏమన్నా చెప్పాలంటే డోజ్ మీమ్ ను వాడుతూ ఉంటారు. బిల్లీ మార్కస్ అండ్ జాక్సన్ పామర్ అనే ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు డోజ్ పేరు మీదుగా ఓ క్రిప్టో కరెన్సీ ని తయారు చేసి దానికి డోజ్ కాయిన్ అని పేరు కూడా పెట్టారు.
ఇప్పుడు ఈ డోజ్ కాయిన్ చాలా ఫేమస్ మీమ్ క్రిప్టో కరెన్సీ. ఈ డోజ్ అంటే ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ కి చాలా క్రేజ్. అతను డోజ్ కాయిన్ ను టేకోవర్ చేసే ఉద్దేశంతో ఉన్నాడో లేదో తెలియదుకానీ...టెస్లా కార్స్ కొనుగోలుకు మాత్రం డోజ్ కాయిన్ క్రిప్టో కరెన్సీ యాక్సెప్ట్ చేస్తానని అప్పట్లో సంచలనం సృష్టించాడు. ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ లోగోగా డోజ్ నే పెట్టాడు. సో ట్విట్టర్ డీలింగ్స్ అని డోజ్ చేయాలంటాడో ఏమో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
— Elon Musk (@elonmusk) April 3, 2023