Twitter Gold Tick: బ్రాండ్స్‌కి బంగారపు టిక్ - స్టార్ట్ చేసిన ట్విట్టర్!
ట్విట్టర్‌లో బిజినెస్ బ్రాండ్స్‌కు ఇకపై గోల్డ్ వెరిఫికేషన్ అందించనున్నారు.
Twitter Gold Tick: ట్విట్టర్ సోమవారం వ్యాపార బ్రాండ్‌ల కోసం గోల్డ్ వెరిఫికేషన్ చెక్‌మార్క్‌ను ప్రారంభించింది. బ్రాండ్ ప్రొఫైల్‌లకు కొత్త టిక్ మార్కులు ఇస్తున్నారు. ట్విట్టర్ వెరిఫికేషన్ ఫీచర్ సోమవారం మరోసారి ప్రారంభం అయింది. దీన్ని గత నెలలో నిలిపివేశారు. దీని ధర ఇప్పటికి నెలకు 8 డాలర్లుగా ఉంది. యాపిల్ డివైస్‌ల్లో ట్విట్టర్ యాప్‌ని ఉపయోగించే వారికి 11 డాలర్లు చార్జ్ చేయనున్నారు.
ఇందులో కంపెనీలకు గోల్డ్ టిక్, రాజకీయ లేదా ప్రభుత్వ సంస్థలకు గ్రే టిక్ అందించనున్నారు. యాప్‌లో కొనుగోళ్లపై యాపిల్ కమీషన్ ఫీజును వ్యతిరేకిస్తున్నట్లు ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ గతంలో చెప్పారు. ట్విట్టర్ బ్లూ అదనపు ఫీచర్లలో ఎడిట్ బటన్‌ను కూడా అందిస్తున్నారు. ఎడిట్ ఆప్షన్‌ను అందించాలనేది చాలా మంది ట్విటర్ వినియోగదారుల చిరకాల డిమాండ్.
బ్లూ-టిక్ సబ్‌స్క్రైబర్‌లకు లభించే ప్రయోజనాలు ఇవే
ట్వీట్‌ను షేర్ చేసిన తర్వాత ఎడిట్ చేస్తే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశం పెరుగుతుందని కొందరు యూజర్లు వాదిస్తున్నారు. బ్లూ టిక్ సబ్‌స్క్రైబర్‌లు తక్కువ ప్రకటనలను చూస్తారని, వారి ట్వీట్‌లు ఇతరుల కంటే ప్రత్యేకంగా ఉంటాయని, హై క్వాలిటీ వీడియోలను పోస్ట్ చేసి చూడగలరని ట్విట్టర్ కూడా చెబుతోంది. ఇది కాకుండా ట్వీట్ పదాల పరిమితి కూడా వారికి ఎక్కువగా ఉంటుంది.
ఇంతకుముందు బ్లూ టిక్‌లు అధిక ప్రొఫైల్ ఖాతాల కోసం అందించేవారు. దీన్ని ట్విట్టర్ ఉచితంగా అందించింది. అయితే ఇది సరికాదని ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ అంటున్నారు. దీని తర్వాత అతను వెరిఫికేషన్‌కు కూడా చార్జ్ చేయడం ప్రారంభించాడు.
ఎలాన్ మస్క్ అక్టోబర్ చివరిలో ట్విట్టర్‌ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి అనేక మార్పులు చేసారు. కంపెనీ రోజుకు 4 మిలియన్ డాలర్ల నష్టంతో నడుస్తోందని, లాభదాయకంగా మారాలని ఆయన అన్నారు. అందుకే బ్లూ టిక్‌కు నగదు వసూలు చేయాలని నిర్ణయించారు.
— Elon Musk (@elonmusk) December 12, 2022
View this post on Instagram