Twitter Blue: ట్విట్టర్ బ్లూ మళ్లీ వస్తోంది - యాపిల్ వినియోగదారులు ఎక్కువ సమర్పించాల్సిందే!
ట్విట్టర్ బ్లూను కంపెనీ తిరిగి తీసుకురానుంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సర్వీస్ తిరిగి లాంచ్ కానుంది.
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ తిరిగి రానుంది. డిసెంబర్ 12వ తేదీన ట్విట్టర్ బ్లూ సర్వీస్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ ధర ఇతరుల కంటే యాపిల్ వినియోగదారులకు ఎక్కువగా ఉండనుంది. నెలకు 8 డాలర్లు లేదా iOSలో నెలకు 11 డాలర్లకు ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ద్వారా వినియోగదారులు బ్లూ చెక్ మార్క్ వంటి ఫీచర్లను పొందవచ్చు.
ట్విట్టర్ బ్లూ: రాబోయే ఫీచర్లు
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌ల కోసం త్వరలో కొత్త ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. స్కామ్‌లు, స్పామ్‌లను ఎదుర్కోవడానికి వారి ట్వీట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం, వెరిఫై కాని వ్యక్తుల కంటే 50 శాతం తక్కువ యాడ్స్ చూడటం, ట్విట్టర్‌లో పొడవైన వీడియోలను పోస్ట్ చేయగల సామర్థ్యం వంటివి త్వరలో రానున్నాయి. ట్విట్టర్ బ్లూ ల్యాబ్స్ పరీక్షిస్తున్న ఫీచర్‌లు అందరికీ అందుబాటులోకి రాకముందే సబ్‌స్క్రైబర్‌లకు ముందస్తు యాక్సెస్‌ను అందిస్తుంది.
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు 'ఎడిట్ ట్వీట్' ఆప్షన్ పొందుతారని, వారి పబ్లిష్ చేసిన ట్వీట్‌లను ఎడిట్ చేసే వీలు కల్పిస్తుందని ట్విట్టర్ ప్రకటించింది. అలాగే, ట్విట్టర్ బ్లూ వినియోగదారులు 1080p వీడియో అప్‌లోడ్‌లు, రీడర్ మోడ్‌ను పొందుతారు.
ట్విట్టర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ కోసం "అధికారిక" లేబుల్‌ని గోల్డ్ చెక్ మార్క్‌ను అందించడం ప్రారంభిస్తుంది. వారం తర్వాత మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అధికారిక ప్రభుత్వ, మల్టీలాటెరల్ అకౌంట్స్ బూడిద రంగు చెక్ మార్క్‌ను పొందనున్నాయి. ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రైబర్‌లు తమ హ్యాండిల్, డిస్‌ప్లే పేరు లేదా ప్రొఫైల్ ఫోటోను మార్చవచ్చు. అయినప్పటికీ వారు అలా చేస్తే తమ ఖాతాను మళ్లీ సమీక్షించే వరకు వారు తమ బ్లూ చెక్ మార్క్‌ను తాత్కాలికంగా కోల్పోతారు.
యాపిల్ వినియోగదారులకు ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ చార్జీ ఎందుకు ఎక్కువగా ఉంది?
iOS వినియోగదారులకు ట్విట్టర్ బ్లూ ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. iOS ద్వారా ట్విట్టర్ బ్లూకు సబ్‌స్క్రయిబ్ చేసేటప్పుడు యాపిల్ 30 శాతం కమిషన్ తీసుకోవడమే దీనికి కారణమని ఒక ట్విట్టర్ వినియోగదారుడు రాశారు. అందువలన iOS వినియోగదారులకు మరింత ఖర్చు అవుతుంది. ఎక్కువ చెల్లించకుండా ఉండటానికి iOS వినియోగదారులు వెబ్‌లో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సేవను కొనుగోలు చేయవచ్చు. దానిని వారి iOS డివైస్‌లో ఉపయోగించవచ్చు.
నవంబర్‌లో ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ సేవను ప్రారంభించిన తర్వాత, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో నకిలీ ఖాతాల సంఖ్య అనేక రెట్లు పెరిగింది. దీని ఫలితంగా కొంత కాలం పాటు ఈ సర్వీసులను నిలిపివేశారు. ట్విట్టర్ బ్లూని నవంబర్ 29న పునఃప్రారంభించవలసి ఉంది, కానీ లాంచ్ ఆలస్యం అయింది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
we’re relaunching @TwitterBlue on Monday – subscribe on web for $8/month or on iOS for $11/month to get access to subscriber-only features, including the blue checkmark 🧵 pic.twitter.com/DvvsLoSO50
— Twitter (@Twitter) December 10, 2022