Twitter Blue: ట్విట్టర్ బ్లూ టిక్ కావాలా నాయనా - మనదేశంలో ఎంత సమర్పించుకోవాలో తెలుసా?
ట్విట్టర్ బ్లూ టిక్‌కు మనదేశంలో సబ్‌స్క్రిప్షన్ ఫీజు వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
Twitter Blue Service: ట్విట్టర్ బ్లూ సర్వీస్ గురించి చాలా కాలంగా చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇది డిసెంబర్ 13న రీలాంచ్ కూడా అయింది. ట్విట్టర్ బ్లూ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అనేక లోపాలు తెరపైకి వచ్చాయి. వీటిని మెరుగుపరచడం కోసం కంపెనీ దీన్ని రీలాంచ్ చేసింది. ప్రారంభించిన తర్వాత కూడా ఈ సేవ ఎంపిక చేసిన ప్రదేశాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ట్విట్టర్ దీన్ని ప్రతిచోటా విస్తరించాలని యోచిస్తుంది. అతి త్వరలో భారత్‌లోనూ దీన్ని ప్రవేశపెట్టనున్నారు. లాంచ్‌కు ముందు భారతదేశంలో దీని ధరకు సంబంధించిన లీక్‌లు కూడా తెరపైకి వచ్చాయి.
బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ నవంబర్‌లో వచ్చింది
కంపెనీ తన బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను నవంబర్‌లో ప్రారంభించింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో బ్లూ టిక్ కోసం ప్రతి నెలా యూజర్ల నుంచి నగదు వసూలు చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో లొకేషన్, వెబ్, ఐఓఎస్ ఆధారంగా వేర్వేరు ఫీజులను నిర్ణయించారు. నవంబర్‌లో ఈ సేవ ప్రారంభించినప్పుడు, నకిలీ ట్విట్టర్ ఖాతాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో కంపెనీ ఈ సర్వీసును వెంటనే నిలిపివేసింది. ఇప్పుడు డిసెంబర్ 13న మళ్లీ రీలాంచ్ అయింది. అయితే ఈ సేవ భారతదేశంలో ఇంకా ప్రారంభం కాలేదు. అయితే దీని ఐవోఎస్ సబ్‌స్క్రిప్షన్ ధర లాంచ్‌కు ముందే లీక్ అయింది.
భారతదేశంలో ట్విట్టర్ బ్లూ ధర
ప్రస్తుతం బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్‌డమ్‌లలో ప్రారంభం అయింది. త్వరలో భారత్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలోని iOS వినియోగదారుల కోసం ఈ సబ్‌స్క్రిప్షన్ ధరను ఒక టిప్‌స్టర్ లీక్ చేశారు. ఐవోఎస్ యాప్ స్టోర్‌లో కొత్త ట్విట్టర్ బ్లూ ధర రూ.999 అని ట్వీట్ చేశాడు. అయితే ఇప్పటి వరకు కంపెనీ ఈ సేవను దేశంలో ప్రారంభించలేదు. దీంతో పాటు భారతదేశంలో దాని ధరకు సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram