(Source: ECI/ABP News/ABP Majha)
Twitter Official Badge: అధికారిక బ్యాడ్జ్‌ను తెచ్చిన ట్విట్టర్ - ఇకపై బ్లూ ఒక్కటే అఫీషియల్ కాదు!
ట్విట్టర్ ‘అఫీషియల్’ బ్యాడ్జ్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది.
అమెరికాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ బ్లూ అకౌంట్, వెరిఫైడ్ అకౌంట్ల మధ్య తేడాను గుర్తించడానికి ఒక ఫీచర్‌ను రూపొందించింది. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ, మరికొందరు మంత్రుల ట్విట్టర్ హ్యాండిల్‌కు 'అఫీషియల్' అనే లేబుల్ వచ్చింది.
మోడీ ధృవీకరించబడిన బ్లూ టిక్ ట్విట్టర్ హ్యాండిల్ ‘@narendramodi’ అకౌంట్ ‘అఫీషియల్‌గా గుర్తింపు పొందింది’. హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరికొందరు మంత్రుల ట్విట్టర్ హ్యాండిల్స్‌లో కూడా ఇదే లేబుల్ కనిపించింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, మరికొందరు ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు సచిన్ టెండూల్కర్ వంటి క్రీడాకారులకు కూడా ఆ లేబుల్ ఇచ్చారు.
ప్రధాన మీడియా సంస్థలు, ప్రభుత్వాలతో సహా కొన్ని ఎంపిక చేసిన ఖాతాలకు 'అఫీషియల్' లేబుల్ ఇచ్చారు.
ట్విట్టర్ అధికారి ఎస్తేర్ క్రాఫోర్డ్ "నీలి రంగు చెక్‌మార్క్‌లు, అధికారికంగా వెరిఫై చేసిన ఖాతాలతో @TwitterBlue సబ్‌స్క్రైబర్‌లను మీరు ఎలా గుర్తించగలరని చాలా మంది వ్యక్తులు అడిగారు. అందుకే మేం 'అఫీషియల్'ని పరిచయం చేస్తున్నాము. గతంలో ధృవీకరించబడిన అన్ని ఖాతాలు 'అఫీషియల్' లేబుల్‌ను పొందవు. ఇది విక్రయానికి అందుబాటులో లేదు. ప్రభుత్వ ఖాతాలు, వాణిజ్య సంస్థలు, వ్యాపార భాగస్వాములు, ప్రధాన మీడియా సంస్థలు, ప్రచురణకర్తలు, కొంతమంది పబ్లిక్ ఫిగర్‌లకు దీన్ని అందిస్తున్నాం." అని ట్వీట్ చేశారు.
కొత్త ట్విట్టర్ బ్లూలో ఐడీ ధృవీకరణను లేదని ఆమె చెప్పారు. "ఇది చెల్లింపు సభ్యత్వం. ఈ ఫీచర్ నీలం రంగు చెక్‌మార్క్, ఎంచుకున్న ఫీచర్‌లకు యాక్సెస్‌ని అందిస్తుంది. మేము ఖాతా రకాల మధ్య తేడాను గుర్తించే మార్గాలతో ప్రయోగాన్ని కొనసాగిస్తాము." ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు అయిన ఎలాన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను టేకోవర్ చేసి, సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్, కొత్త వెరిఫికేషన్ సిస్టమ్‌తో సహా అనేక మార్పులను తీసుకువచ్చారు.
A lot of folks have asked about how you'll be able to distinguish between @TwitterBlue subscribers with blue checkmarks and accounts that are verified as official, which is why we’re introducing the “Official" label to select accounts when we launch. pic.twitter.com/0p2Ae5nWpO
— Esther Crawford ✨ (@esthercrawford) November 8, 2022
Not all previously verified accounts will get the “Official” label and the label is not available for purchase. Accounts that will receive it include government accounts, commercial companies, business partners, major media outlets, publishers and some public figures.
— Esther Crawford ✨ (@esthercrawford) November 8, 2022
The new Twitter Blue does not include ID verification – it’s an opt-in, paid subscription that offers a blue checkmark and access to select features. We’ll continue to experiment with ways to differentiate between account types.
— Esther Crawford ✨ (@esthercrawford) November 8, 2022