(Source: ECI/ABP News/ABP Majha)
రూ.14 వేలలోపే షావోమీ స్మార్ట్ టీవీ లాంచ్ - ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేలు కూడా!
షావోమీ కొత్త స్మార్ట్ టీవీ సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
షావోమీ స్మార్ట్ టీవీ ఏ సిరీస్ మనదేశంలో లాంచ్ అయింది. 32 అంగుళాలు, 40 అంగుళాలు, 43 అంగుళాల వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీలు పని చేయనున్నాయి. డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్చువల్:ఎక్స్ సపోర్ట్ ఉన్న 20W స్పీకర్లను అందించనున్నారు. క్వాడ్‌కోర్ ఏ35 చిప్‌సెట్‌లు కూడా ఈ టీవీల్లో ఉన్నాయి.
షావోమీ స్మార్ట్ టీవీ ఏ సిరీస్ ధర
ఈ టీవీ ధరలు రూ.14,999 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇది బేస్ మోడల్ అయిన 32 అంగుళాల టీవీ ధర. ప్రారంభ ఆపర్ కింద దీన్ని రూ.13,999కే కొనుగోలు చేయవచ్చు. 40 అంగుళాల మోడల్‌ను రూ.22,999కు, 43 అంగుళాల మోడల్ ధరను రూ.24,999కు కొనుగోలు చేయవచ్చు. జులై 25వ తేదీన ఎంఐ.కాం, ఎంఐ హోమ్స్, ఫ్లిప్‌కార్ట్‌ల్లో దీని సేల్ ప్రారంభం కానుంది.
షావోమీ స్మార్ట్ టీవీ ఏ సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
గూగుల్ టీవీ ఆధారిత ప్యాచ్‌వాల్ యూఐపై ఈ టీవీ పని చేయనుంది. గూగుల్ టీవీతో ఇంటిగ్రేట్ అయినందున వినియోగదారులు యాప్స్‌ను స్ట్రీమ్ చేయడం, లైవ్ టీవీని యాక్సెస్ చేయడం వంటివి చేయవచ్చు. ఇన్‌బిల్ట్ క్రోమ్ కాస్ట్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ప్యాచ్‌వాల్ ప్లస్ సర్వీస్ ద్వారా 200కు పైగా లైవ్ ఛానెల్స్‌ను ఉచితంగా చూడవచ్చు. ఐఎండీబీ ఇంటిగ్రేషన్, లైవ్ టీవీ, యూనివర్సల్ సెర్చ్ వంటి ఫీచర్లను కూడా ఈ టీవీలు ఆఫర్ చేయనున్నాయి. పేరెంటల్ లాక్ ద్వారా కిడ్స్ మోడ్‌ను యాక్సెస్ చేయవచ్చు. ప్యాచ్‌వాల్‌పై యూట్యూబ్ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. కాబట్టి యూట్యూబ్ మ్యూజిక్ కంటెంట్ కూడా అందుబాటులో ఉండనుంది.
ఈ లేటెస్ట్ టీవీలో ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. కంపెనీ వివిడ్ పిక్చర్ ఇంజిన్ ఫీచర్ కూడా ఉంది. 1.5 జీబీ వరకు ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ ఈ టీవీలో అందించారు. మినిమల్ బెజెల్స్ ఉన్న మెటాలిక్ డిజైన్‌తో షావోమీ స్మార్ట్ టీవీ ఏ సిరీస్ లాంచ్ అయింది.
డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఏఆర్‌సీ, ఏఎల్ఎల్ఎం సపోర్ట్ ఉన్న రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ 2.0, ఏవీ, హెడ్ ఫోన్ జాక్‌లు అందించారు. టీవీతో పాటు షావోమీ బ్లూటూత్ రిమోట్ రానుంది. క్విక్ మ్యూట్, క్విక్ వేక్, క్విక్ సెట్టింగ్స్ కూడా ఈ రిమోట్‌లో ఉన్నాయి.
View this post on Instagram
View this post on Instagram
Read Also: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial