Apple TV 4K 2022: యాపిల్ టీవీ డివైస్ వచ్చేసింది - రూ.15 వేలలోపే!
యాపిల్ కొత్త టీవీ బాక్స్ గ్లోబల్ లాంచ్ అయింది. అదే యాపిల్ టీవీ 4కే (2022).
యాపిల్ టీవీ 4కే (2022) గ్లోబల్ లాంచ్ అయింది. మనదేశంలో కూడా తీసుకువచ్చారు. యాపిల్ లేటెస్ట్ వెర్షన్ టీవీఓఎస్ ప్లాట్‌ఫాంపై ఈ టీవీ పని చేయనుంది. దీనికి ముందు వచ్చిన యాపిల్ టీవీ 4కే వెర్షన్ కంటే మెరుగ్గా ఇది పని చేస్తుందని కంపెనీ తెలిపింది. హెచ్‌డీఆర్10+ ఫార్మాట్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
యాపిల్ టీవీ 4కే (2022) వేరియంట్లు, ధర
ఇందులో 64 జీబీ వేరియంట్ ధరను రూ.14,900గా నిర్ణయించారు. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,900గా ఉంది. వీటిని యాపిల్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. నవంబర్ 4వ తేదీ నుంచి దీని డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
యాపిల్ టీవీ 4కే (2022) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
యాపిల్ టీవీ 4కే (2022) డిజైన్ ముందు తరం యాపిల్ టీవీ 4కే తరహాలోనే ఉంది. ముందు తరం సిరి రిమోట్‌ను మళ్లీ ఇందులో అందించారు. నావిగేషన్, కంట్రోల్స్‌కు దీన్ని నేచురల్‌గా ఉపయోగించవచ్చు. 64 జీబీ వేరియంట్లో కేవలం వైఫై కనెక్టివిటీ మాత్రమే ఉంది. హైఎండ్ వేరియంట్‌ను ఎథర్‌నెట్ కనెక్షన్‌తో కూడా ఉపయోగించవచ్చు.
ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐప్యాడ్ మినీల్లో (ఆరో తరం) అందించిన ఏ15 బయోనిక్ చిప్‌నే ఇందులో కూడా అందించారు. స్ట్రీమింగ్, గేమింగ్‌ల్లో ఇది మెరుగైన పెర్ఫార్మెన్స్‌ను అందించనుంది.
ముందుతరం డివైస్‌ల తరహాలోనే యాపిల్ టీవీ 4కే అల్ట్రా హెచ్‌డీ స్ట్రీమింగ్‌ను సపోర్ట్ చేయనుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌ల్లోని కంటెంట్‌ను అల్ట్రా హెచ్‌డీ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు. హెచ్‌డీఆర్10+ హై డైనమిక్ రేంజ్ కంటెంట్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
View this post on Instagram