అన్వేషించండి

Twitter: ట్విట్టర్‌లోకి ట్రంప్ రీఎంట్రీ - మస్క్ ఏం అంటున్నాడంటే?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ట్విట్టర్‌లోకి తిరిగి తీసుకురావాలా వద్దా అని ఎలాన్ మస్క్ పోల్ పెట్టారు.

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ శనివారం నాడు తాను పోస్ట్ చేసిన ట్విట్టర్ పోల్‌పై స్పందించారు. గతంలో ట్విట్టర్ నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనను ఇందులోకి తిరిగి తీసుకురావాలా వద్దా అనే దానిపై ఓటు వేయాలని వినియోగదారులను కోరారు. ఈ పోల్ గంటకు 1 మిలియన్ ఓట్లను పొందుతున్నట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. "ట్రంప్ పోల్ గంటకు ~1 మిలియన్ ఓట్లను పొందుతోంది!" అని మస్క్ ట్వీట్ చేశాడు. "హింసను మరింత ప్రేరేపించే ప్రమాదం కారణంగా" డొనాల్డ్ ట్రంప్‌ను 2021లో ట్విట్టర్ నుండి శాశ్వతంగా నిషేధించారు.

ఈ పోల్‌కు ఇప్పటికే 8 మిలియన్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. దాదాపు 52 శాతం మంది తీసుకురావాలి అని ఓటు వేశారు. 48 శాతం మంది వద్దు అని ఓటు వేశారు. ట్విట్టర్ ఉద్యోగులు కంపెనీలో "అత్యంత హార్డ్‌కోర్" పద్ధతిలో పనిచేయాలని లేదా ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని ఎలాన్ మస్క్ నుండి అల్టిమేటం అందుకున్నట్లు నివేదించబడిన తర్వాత కంపెనీ నుండి నిష్క్రమిస్తున్నారు. కొత్త ట్విట్టర్ చీఫ్ హై ఇంటెన్సిటీతో ఎక్కువ గంటలు పని చేయాలని పిలుపునిచ్చారు.

ట్విట్లర్ నుంచి దాదాపు సగం మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత ట్విట్టర్ ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోయిన డజన్ల కొద్దీ ఉద్యోగులను సంప్రదించినట్లు తెలుస్తోంది. తిరిగి రావాలని కోరిన వారిని పొరపాటున తీసేశామని చెప్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ తన కథనంలో పేర్కొంది. మస్క్ ఊహించిన కొత్త ఫీచర్లను రూపొందించడానికి వారి అనుభవం అవసరమని మేనేజ్‌మెంట్ గ్రహించకముందే కొందరిని తీసేశారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ గత వారం ఈమెయిల్ ద్వారా దాదాపు 3,700 మంది వ్యక్తులను తొలగించింది. ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసిన తర్వాత ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఈ-మెయిల్, స్లాక్ వంటి కంపెనీ సిస్టమ్‌లకు వారి యాక్సెస్‌ను అకస్మాత్తుగా సస్పెండ్ చేసిన తర్వాత చాలా మంది ఉద్యోగులు ఈ నిర్ణయం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు కొందరిని తిరిగి రమ్మనడం ఉద్యోగులను తొలగించే విషయంలో కంపెనీ ఎంత అస్తవ్యస్తమైన ప్రక్రియను పాటించిందో తెలియజేస్తుంది.

"Twitterలో ఉద్యోగులను తగ్గించడం గురించి చూస్తే కంపెనీ రోజుకు 4 మిలియన్ డాలర్లకు పైగా నష్టపోతున్నప్పుడు మరో ఆప్షన్ లేదు." అని మస్క్ గతంలో ట్వీట్ చేశారు. ట్విటర్‌లో ప్రస్తుతం దాదాపు 3,700 మంది ఉద్యోగులు మిగిలి ఉన్నారు.

వీరిని మస్క్ కొత్త ఫీచర్‌లను అమలు చేయడానికి కంపెనీలో ఉంచారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు టార్గెట్లను చేరుకోవడానికి కార్యాలయంలోనే పడుకున్నారు. "పేరడీ అని స్పష్టంగా పేర్కొనకుండా ఎవరైనా మరొకరి ట్విట్టర్ హ్యాండిల్‌ను అనుకరించే ఖాతా తెరిస్తే దాన్ని శాశ్వతంగా నిలిపివేస్తాం." అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశాడు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Champion Teaser : ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
Champion Teaser : ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ - 'ఛాంపియన్' రిలీజ్ టీజర్
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
బంగ్లాదేశ్‌లో తగలబడుతున్న హిందువుల ఇళ్లు.. మంటల్లో కాలిపోయి 7 ఏళ్ల బాలిక మృతి
ISRO's Baahubali Mission : చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
చరిత్ర సృష్టించిన ఇస్రో! బాహుబలి రాకెట్ తో అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగం విజయవంతం!
Baahubali The Epic OTT : ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
ఓటీటీలో 'బాహుబలి: ది ఎపిక్' - ఆ సీన్స్ యాడ్ చేస్తారా?
Lalit Modi Video: మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
మేం ఇద్దరం భారత్ నుంచి పారిపోయాం.. విజయ్ మాల్యా బర్త్‌డే పార్టీలో లలిత్ మోడీ వీడియో
Embed widget