అన్వేషించండి

Trump Update: నన్నే బహిష్కరిస్తారా.. నేనే కొత్త సర్వీస్‌తో వస్తా.. ఫేస్‌బుక్, ట్వీటర్‌లపై ట్రంప్ వార్!

ఫేస్‌బుక్, ట్వీటర్‌లపై ట్రంప్ యుద్ధం ప్రకటించాడు. ఈ సర్వీసుల నుంచి తనను బహిష్కరించడంతో ట్రూత్ సోషల్ అనే కొత్త సోషల్ మీడియా సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపాడు.

అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా యాప్‌ను ప్రారంభించనున్నారు. దీనికి ట్రూత్ సోషల్ అని పేరు పెట్టారు. ట్వీటర్, ఫేస్‌బుక్ వంటి పెద్ద టెక్నాలజీ కంపెనీలు ట్రంప్ ఖాతాలపై ఆంక్షలు విధించాయి. దీంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ట్రూత్ సోషల్ అనే యాప్‌ను కొత్త కంపెనీ ద్వారా ప్రారంభించనున్నట్లు ట్రంప్ తెలిపాడు.

ట్వీటర్‌లో తాలిబన్లు కూడా ఎంతో మంది ఉన్నారు. అయితే అమెరికా ప్రెసిడెంట్ మాత్రం సైలెంట్‌గా ఉండాల్సి వస్తుంది. ఇది ఎంతమాత్రం ఆమోదించదగ్గది కాదని ట్రంప్ ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో తెలిపాడు. తన మొదటి ట్రూత్‌ను ట్రూత్ సోషల్ ద్వారా తెలియజేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. పెద్ద టెక్ కంపెనీలపై పోరాటం కోసం, తన ఆలోచనలను పంచుకోవడం కోసం ట్రూత్ సోషల్ యాప్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపాడు.

దీనికి సంబంధించిన బీటా లాంచ్ వచ్చే నెలలో జరగనుంది. 2022 మొదటి త్రైమాసికంలో ఫుల్ రోల్అవుట్ కూడా ప్రారంభం కానుంది. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ(టీఎంటీజీ) కంపెనీ పేరుతో ఈ సర్వీస్ ప్రారంభం కానుంది. దీంతోపాటు టీఎంటీజీ ప్లస్ అనే సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ సర్వీసును కూడా కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది.

అమెజాన్.కాంకు చెందిన ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసులు, గూగుల్ క్లౌడ్ సర్వీసులకు పోటీగా.. కొత్త సేవలు కూడా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్ అధికార ప్రతినిధి లిజ్ హారింగ్టన్ కూడా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఎంతో కాలం నుంచి పెద్ద టెక్ కంపెనీలు చాలా మందిని మాట్లాడనివ్వకుండా చేస్తున్నాయని ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అన్నారు.

ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి ఇతర సోషల్ మీడియా కంపెనీలు డొనాల్డ్ ట్రంప్‌ను తమ ప్లాట్‌ఫాంల నుంచి బహిష్కరించాయి. గతేడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో మోసం జరిగిందని, తాను ఓడిపోలేదని ట్రంప్ ఒక ప్రసంగంలో చెప్పిన అనంతరం అతని మద్దతుదారులు అమెరికా రాజధానిలో దాడులకు దిగారు. ఆ కారణంగానే ట్రంప్‌ను ఫేస్‌బుక్, ట్వీటర్ బహిష్కరించాయి.

Also Read: Apple Macbook Pro 2021: మోస్ట్ పవర్‌ఫుల్ యాపిల్ ల్యాప్‌టాప్‌లు వచ్చేశాయ్.. ధర ఎంతో తెలుసా?

Also Read: అత్యంత చవకైన 5జీ ఫోన్ లాంచ్ చేసిన నోకియా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
కేంద్రానికి తెలంగాణ కాంగ్రెస్ బిగ్ డిమాండ్! ఎల్‌నినో నేపథ్యంలో రూ.30 వేల కోట్లు డిమాండ్
Pawan Kalyan: పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
పంచాయతీ ఎన్నికల్లో పోటీపై జనసైనికులకు పూర్తి స్వేచ్ఛ.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
Viral Video: భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
భార్యతో గొడవ.. బ్యాంక్ నుంచి తెచ్చి రూ.500 నోట్లు తగలబెట్టిన భర్త 
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
Safest Electric Cars: జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
జర్నీలో మీరు పూర్తిగా సురక్షితం.. సేఫ్టీలో బెస్ట్ రేటింగ్ పొందిన 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
Congress Politics: గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
గాంధీ భవన్‌లో కొత్త ఇంఛార్జ్ సందీప్‌నకు సీఎం రేవంత్ ఘనస్వాగతం.. కీలక అంశాలపై చర్చ
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Embed widget