Tecno Spark 8 Pro: రూ.15 వేలలోపే టెక్నో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్ ఫోన్ టెక్నో స్పార్క్ 8 ప్రోని బంగ్లాదేశ్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.15 వేలలోపే ఉంది.
టెక్నో స్పార్క్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ బంగ్లాదేశ్‌లో లాంచ్ అయింది. ఇందులో రెండు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ కూడా ఇందులో ఉన్నాయి.
టెక్నో స్పార్క్ 8 ప్రో ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 16,990 బంగ్లాదేశ్ టాకాలుగా(సుమారు రూ.14,700) నిర్ణయించారు. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, కొమొడో ఐల్యాండ్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. దీని ముందు వెర్షన్ టెక్నో స్పార్క్ 8 మాత్రం మనదేశంలో అందుబాటులో ఉంది. రూ.7,999కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీన్ని బట్టి టెక్నో స్పార్క్ 8 ప్రో కూడా మనదేశంలో త్వరలో లాంచ్ కానుందని అనుకోవచ్చు.
టెక్నో స్పార్క్ 8 ప్రో స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ ఆధారిత హైఓఎస్ వీ7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ నాచ్ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఈఎంఎంసీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ కెమెరా, మరో ఏఐ లెన్స్ కూడా ఉన్నాయి. సూపర్ నైట్ మోడ్ 2.0, బ్యూటీ 4.0 వంటి కెమెరా ఫీచర్లు ఇందులో అందించారు. డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌ను ఇందులో అందించారు. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
4జీ, బ్లూటూత్ వీ5, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, ఓటీజీ, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, జీ-సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లను ఇందులో అందించారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.87 సెంటీమీటర్లుగా ఉంది.
Also Read: OnePlus RT: మనదేశంలో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు సూపర్.. ధర ఎంతంటే?
Also Read: Infinix New Phone: రూ.6 వేలలోనే కొత్త స్మార్ట్‌ఫోన్.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ.. మిగతా ఫీచర్లు?
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!
Also Read: 7 అంగుళాల భారీ డిస్‌ప్లేతో హానర్ కొత్త ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు.. 5జీ కూడా!