Tecno Pova 5G: టెక్నో మొదటి 5జీ ఫోన్ వచ్చేసింది.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
టెక్నో తన మొదటి 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే టెక్నో పోవా 5జీ.
![Tecno Pova 5G: టెక్నో మొదటి 5జీ ఫోన్ వచ్చేసింది.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు! Tecno Pova 5G Launched With 6000 mah Battery and 50MP Triple Camera Setup Tecno Pova 5G: టెక్నో మొదటి 5జీ ఫోన్ వచ్చేసింది.. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/27/1717f9a4a85467e0530ac9a4a6b0c31d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టెక్నో పోవా 5జీ స్మార్ట్ ఫోన్ నైజీరియాలో లాంచ్ అయింది. కంపెనీ మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే. ఇందులో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను అందించారు.
టెక్నో పోవా 5జీ ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 1,29,000 నైజీరియన్ నైరాలుగా(సుమారు రూ.23,500) నిర్ణయించారు. డాజిల్ బ్లాక్, పోలార్ సిల్వర్, పవర్ బ్లూ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
టెక్నో పోవా 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.95 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 82.8 శాతంగానూ, పిక్సెల్ రిజల్యూషన్ 1080 x 2460గానూ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత హైఓఎస్ 8.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. 3 జీబీ వర్చువల్ ర్యామ్ కూడా దీంతోపాటు అందించనున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా దీంతోపాటు అందించారు. డ్యూయల్ సిమ్, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, ఏ-జీపీఎస్, బైదు, గ్లోనాస్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.9 సెంటీమీటర్లుగా ఉంది.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?
Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)