Samsung Galaxy S21 FE: శాంసంగ్ ఎస్21 ఎఫ్ఈ వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లు.. ఆండ్రాయిడ్ 12 కూడా!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈని లాంచ్ చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ మనదేశంలో మంగళవారం లాంచ్ అయింది. అయితే ఈ ఫోన్ ఎప్పటినుంచో వార్తల్లో ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ధర
ఇందులో రెండు స్టోరేజ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 699 యూరోలుగా (సుమారు రూ.70,200) ఉండగా.. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 749 యూరోలుగా (సుమారు రూ.75,200) నిర్ణయించారు. గ్రాఫైట్, లావెండర్, ఆలివ్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో రూ.49,999 ధరతో లాంచ్ అయింది. గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ రూ.60 వేల రేంజ్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. దేశాన్ని బట్టి ఇందులో క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ లేదా శాంసంగ్ ఎక్సినోస్ 2100 ప్రాసెసర్లను అందించనున్నారు.
కెమెరాల విషయానికి వస్తే. .ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించగా.. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాలు కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.
8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి ఫీచర్లు ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరో, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి.
దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 25W వైర్డ్, 15W వైర్‌లెస్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా.. బరువు 177 గ్రాములుగా ఉంది. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు.
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!