Samsung Galaxy M55s 5G: శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ వచ్చేసింది - ధర రూ.20 వేలలోపే!
Samsung New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ. దీని ధర రూ.20 వేలలోపే అందుబాటులో ఉంది.
Samsung Galaxy M55s 5G Launched: శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు ముందువైపు కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాను సెల్ఫీ షూటర్‌గా అందించారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ ధర (Samsung Galaxy M55s 5G Price in India)
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్, రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనిపై రూ.2,000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. కోరల్ గ్రీన్, థండర్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Samsung Galaxy M55s 5G Specifications)
ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎస్అమోఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవల్‌గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీ రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. దీన్ని వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ అందుబాటులో ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇందులో ఉన్న డ్యూయల్ రికార్డింగ్ ఫీచర్ ద్వారా ముందు, వెనక కెమరాలతో ఒకేసారి షూట్ చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎం55ఎస్ 5జీలో 5000 ఎంఏహచ్ బ్యాటరీన అందించారు. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి. వీటి ద్వారా ఫోన్‌కు అదనపు సెక్యూరిటీ లభించనుంది. ఈ ఫోన్ మందం 0.78 సెంటీమీటర్లుగా ఉంది. శాంసంగ్ ఇటీవలే మనదేశంలో పలు బడ్జెట్ 5జీ ఫోన్లను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరింది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే