Samsung F23 5G: శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. ప్రాసెసర్ వివరాలు లీక్!
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ స్మార్ట్ ఫోన్ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్లలో కనిపించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్ ఫోన్ 2021 జులైలోనే మనదేశంలో లాంచ్ అయింది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. ఇప్పుడు దీనికి తర్వాతి వెర్షన్‌గా గెలాక్సీ ఎఫ్23 కూడా లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. SM-E236B మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ గీక్‌బెంచ్ 5 బెంచ్ మార్క్ డేటాబేస్‌లో కనిపించింది. ఈ ఫోన్ గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 640 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 1,820 పాయింట్లను సాధించింది.
ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. దీని క్లాక్ స్పీడ్ 2.21 గిగాహెర్ట్జ్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇది క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ అయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్ ఇందులో ఉండనుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 స్మార్ట్ ఫోన్.. కొన్ని మార్కెట్లలో శాంసంగ్ గెలాక్సీ ఎం22గా లాంచ్ అయింది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్23 5జీ.. శాంసంగ్ గెలాక్సీ ఎం23 5జీగా కొన్ని మార్కెట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ గురించి శాంసంగ్ ఇంతవరకు అధికారికంగా ఏమీ చెప్పలేదు.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 4జీ వేరియంట్‌లో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్‌ను అందించారు. ఇందులో 6.4 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిజల్యూషన్ హెచ్‌డీ+గా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇందులో అందించారు. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది.
Also Read: iPhone 15 Series: ఐఫోన్లలో మొదటిసారి ఆ కెమెరాలు.. ఎప్పుడు రానున్నాయంటే?
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

