Samsung Galaxy F13: సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్13 - ఈ బడ్జెట్ ఫోన్ ఫీచర్స్ చూస్తే, మీ పాత ఫోన్‌కు గుడ్‌బై చెప్పేస్తారు!
సామ్ సంగ్ నుంచి మార్కెట్లోకి విడుదలైన మరో ఫోన్ Galaxy F13. రూ. 11,999 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్.. Poco M3, Realme 7i, Moto G30ను దాటి అమ్మకాల్లో ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.
సామ్ సంగ్ కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు అద్భుతమైన స్మార్ట్ ఫోన్లు వినిగదారుల ముందుకు వస్తూనే ఉన్నాయి. డిజైన్, కెమెరా నుంచి మొదలుకొని బ్యాటరీ వరకు చక్కటి ఫ్యాక్ తో లేటెస్ట్ ఫోన్లు రిలీజ్ చేస్తోంది. మధ్య తరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగానే Samsung Galaxy F13ని విడుదల చేసింది. రూ. 11,999 ధరతో ప్రారంభించబడిన ఈ ఫోన్ ప్రత్యర్థి ఫోన్ల అమ్మకాలను వెనక్కి నెట్టాలనుకుంటోంది. తాజాగా విడుదలైన బడ్జెట్ ఫోన్‌ల రేసులో Galaxy F13 ఎక్కడ నిలుస్తుందో చూడాలి. మరి, ఈ ఫోన్‌లో ప్లస్, మైనస్‌లు ఏమిటో చూద్దామా.
క్విక్ స్పెక్స్ చెక్
Samsung Galaxy F13లో 6.6-అంగుళాల FullHD+ డిస్‌ప్లే ఉంది. Exynos 850తో కలిపి 4GB RAMతో రన్ అవుతుంది. 64 GB, 128 GB ఎక్స్ పాండబుల్ స్టోరేజ్ తో విడుదల అయ్యింది. 128 జీబీ ఫోన్ ధర రూ. 12,999గా కంపెనీ నిర్ణయించింది. 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాతో సహా వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంది.
డిజైన్, డిస్ ప్లే
Galaxy F13 చక్కటి లుక్ కలిగి ఉంది. బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ చేతిలోచూడ్డానికి బాగుంటుంది. Galaxy F13 పాలికార్బోనేట్ బిల్డ్, టెక్చర్డ్ బ్యాక్ లు ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. డిస్‌ప్లే చాలా బ్రైట్ నెస్ తో కూడి ఉంటుంది. తక్కువ బ్రైట్ నెస్ లోనూ చక్కగా చూసే అవకాశం ఉంది. వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కుడి వైపున ఉన్నాయి. SIM ట్రే ఎడమ వైపున ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్, 3.5mm ఆడియో జాక్ ఫోన్ కింది భాగంలో ఉన్నాయి. వాల్యూమ్ రాకర్‌కు కొంచెం దిగువన సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. తో వస్తుంది. యాక్సెస్ చేయడం చాలా సులభం. ఈ స్మార్ట్ ఫోన్ వాటర్ ఫాల్ బ్లూ, నైట్‌స్కీ గ్రీన్, సన్‌రైజ్ కాపర్ అనే మూడు కలర్ షేడ్స్ లో అందుబాటులో ఉంది.
బ్యాటరీ
ఈ ఫోన్ చాలా బ్యాటరీ బ్యాకప్ ను కలిగి ఉంటుంది. 6000mAh పవర్ హౌస్ మీరు రోజంతా బ్యాటరీ అయిపోకుండా చూస్తుంది. దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు రెండు గంటలు పడుతుంది. కానీ ఒకసారి ఛార్జ్ చేస్తే.. అది పూర్తి నిడివి గల బాలీవుడ్ సినిమా, వాట్సాప్ లో రెండు వీడియోలు, దాదాపు 2 గంటల వెబ్, సోషల్ మీడియా బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా కొంత బ్యాటరీ మిగిలి ఉంటుంది. మొత్తంగా ఈ ఫోన్ బ్యాటరీ ఆకట్టుకుంటుంది.
కెమెరా
Galaxy F13 PDAFతో 50 MP మెయిన్ లెన్స్, LED ఫ్లాష్‌తో కూడిన 5MP వైడ్ యాంగిల్ సెన్సార్ తో వెనుక వైపు డ్యూయల్ కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంది. కెమెరా యాప్ ప్రాథమికమైనది. ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. ప్రో, పనోరమా, ఫుడ్ మోడ్ వంటి ఎంపికల కలిగి ఉంది. ఈ కెమెరాలో నైట్ మోడ్ లేదు. మీ ఫోటోలు, వీడియోలకు లైవ్ స్టిక్కర్‌లను జోడించడానికి కెమెరా యాప్ లో డెకోపిక్ ఎంపిక ఉంది. అవుట్‌డోర్, ఇండోర్ రెండింటిలోనూ పగటి వెలుగులో మంచి ఫోటోలను అందిస్తుంది. ఫోటోలు స్పష్టంగా, ఫోకస్ లో కనిపిస్తాయి. వైడ్ యాంగిల్ లెన్స్ కూడా మంచిగా పని చేస్తున్నాయి. క్లోజప్ షాట్స్ డీసెంట్ గా ఉన్నాయి. HD నాణ్యతతో మంచి వీడియోలను తీయడానికి అవకాశం ఉంది. నైట్ మోడ్ లేకుండా ఫోటోలు తీయడం మూలంగా మసకగా కనిపిస్తాయి. 8MP సెల్ఫీ కెమెరా హైలైట్. ఇది అన్ని లైటింగ్స్ లో మంచి సెల్ఫీలను అందిస్తుంది.
సాధారణ వినియోగానికి అనుకూలం
ఈ ఫోన్ రోజువారీ సాధారణ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. త్వరగా వేడెక్కడం మీకు కనిపించదు. తేలికపాటి గేమ్ లకు అనుకూలం. భారీ గేమర్స్ కోసం దీని కంటే మెరుగైన ఎంపికలు ఉన్నాయి. అన్ని బ్లోట్ వేర్ ఉన్నప్పటికీ, యాప్‌ల మధ్య మార్పిడి చేసినప్పుడు, బ్యాక్‌గ్రౌండ్ లో మల్టీఫుల్ యాప్‌లను తెరిచినప్పుడు ఫోన్ చాలా సున్నితంగా పనిచేస్తుంది. మంచి లుక్, మంచి సెల్ఫీ కెమెరా, మంచి బ్యాటరీ లైఫ్ ఉన్న బడ్జెట్ ఫోన్ కావాలంటే Samsung Galaxy F13ని కొనుగోలు చేయొచ్చు.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?