అన్వేషించండి

Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?

శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.

Samsung Galaxy A54 5G: శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫోన్లలో గెలాక్సీ ఏ53 5జీ ఒకటి. దాని తర్వాతి వెర్షన్ ఎప్పుడు వస్తుంది అని ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీని కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధరను రూ.40,999గా నిర్ణయించారు.

అసమ్ లైమ్, అసమ్ గ్రాఫైట్, అసమ్ వయొలెట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మార్చి 28వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3,000 వరకు క్యాష్ బ్యాక్ లభించనుంది. ఇక ప్రీ-ఆర్డర్ చేసిన వారు శాంసంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ రూ.999కే కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. నాలుగు జనరేషన్ల ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని కంపెనీ తెలిపింది. 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. శాంసంగ్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. డాల్బీ టెక్నాలజీ ఉన్న స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 202 గ్రాములుగా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎఫ్04 స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇందులో అందించారు. ఫ్రంట్ కెమెరా కోసం వాటర్ డ్రాప్ తరహా నాచ్ అందుబాటులో ఉంది. ఇందులో ర్యామ్ ప్లస్ ఫీచర్ అందించారు. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. 64 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధరను రూ.7,499గా నిర్ణయించారు.

టాప్ హెడ్ లైన్స్

Mobile Recharge Price Hike: త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
త్వరలో పెరగనున్న మొబైల్ రీచార్జ్ ప్లాన్ ధరలు.. కంపెనీలు ఏం చెబుతాయి
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget