By: ABP Desam | Updated at : 17 Mar 2023 02:24 AM (IST)
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. (Image: Samsung)
Samsung Galaxy A34 5G: శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీని కంపెనీ లాంచ్ చేసింది. ఇందులో సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.30,999గా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధరను రూ.32,999గా నిర్ణయించారు.
అసమ్ లైమ్, అసమ్ గ్రాఫైట్, అసమ్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీకి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. మార్చి 28వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద ఈ ఫోన్ కొనుగోలు చేసే వారికి కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.3,000 వరకు క్యాష్ బ్యాక్ అందించనున్నారు. ప్రీ-ఆర్డర్ చేసిన వారు శాంసంగ్ గెలాక్సీ బడ్స్ లైవ్ ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ను రూ.999కే కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ పని చేయనుంది. నాలుగు జనరేషన్ల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, ఐదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందిస్తామని శాంసంగ్ తెలిపింది. 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. ఈ మొబైల్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ వెనకవైపు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. 5జీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, జీపీఎస్, గ్లోనాస్, బైదు, గెలీలియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. డాల్బీ టెక్నాలజీ ఉన్న స్టీరియో స్పీకర్లను ఇందులో అందించారు. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 199 గ్రాములుగా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీని కంపెనీ ఏ34తో పాటు లాంచ్ చేసింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.38,999గా ఉంది. ఇక టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధరను రూ.40,999గా నిర్ణయించారు.
Vodafone Idea: నష్టాల్లో వొడాఫోన్ ఐడియా - అదే జరిగితే, ఇక ఆ ‘సర్వీస్’ క్లోజ్ ?
Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!
Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!
Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి
PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్ 30 వరకు ఛాన్స్
Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!
Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?