Samsung Galaxy A05: కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.13 వేలలోపే గెలాక్సీ ఏ05 - స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే!
Samsung Galaxy A05 Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ05.
![Samsung Galaxy A05: కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.13 వేలలోపే గెలాక్సీ ఏ05 - స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే! Samsung Galaxy A05 With 50MP Dual Rear Cameras Check Price Specifications Details Samsung Galaxy A05: కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.13 వేలలోపే గెలాక్సీ ఏ05 - స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/25/9e25e52e5516e2484931a37e1a5010b81700914513337252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Samsung A05: శాంసంగ్ గెలాక్సీ ఏ05 స్మార్ట్ ఫోన్ కొన్ని దేశాల్లో లాంచ్ అయింది. గెలాక్సీ ఏ04కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మనదేశంలో కూడా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై శాంసంగ్ గెలాక్సీ ఏ05 పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మూడు కలర్ ఆప్షన్లు, రెండు ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో శాంసంగ్ గెలాక్సీ ఏ05ను కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఏ05 ధర (Samsung Galaxy A05 Price)
ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లో కనిపించింది. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. బ్లాక్, లైట్ గ్రీన్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో శాంసంగ్ గెలాక్సీ ఏ05ను కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ ఇంకా ప్రారంభం కాలేదు.
శాంసంగ్ గెలాక్సీ ఏ05 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Samsung Galaxy A05 Specifications, Features)
ఇందులో 6.7 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్‌యూఐ 5.1 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఏ05 రన్ కానుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇందులో ఉంది. 4జీ, వైఫై, బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ 2.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. సెక్యూరిటీ కోసం 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. దీని మందం 0.88 సెంటీమీటర్లు కాగా, బరువు 195 గ్రాములుగా ఉంది. శాంసంగ్ ఇటీవలే తక్కువ ధరలో మంచి ఫోన్లు లాంచ్ చేస్తుంది. రూ.15 వేల లోపు ధరలో మంచి 5జీ ఫోన్లు కూడా శాంసంగ్ పోర్ట్‌ఫోలియోలో ఉండటం విశేషం.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)