Samsung Galaxy Z Fold 6 5G Discount: ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.55000 తగ్గింపు.. ఆఫర్ ధరకే మడతబెట్టేయండి మరి
Samsung Galaxy foldable phone | శాంసంగ్ గెలాక్సీ Z Fold 6 5G ఫోల్డబుల్ ఫోన్ మీద భారీ ఆఫర్ ఇచ్చారు. రూ.55000 కంటే తక్కువ ధరకు ఈ శాంసంగ్ ఫోన్ కొనేయండి.
మీరు ఫోల్డబుల్ ఫోన్లు ఇష్టపడుతున్నారా, అధిక ధర కారణంగా వాటిని కొనలేకపోతున్నారా.. అయితే మీకు ఇది కచ్చితంగా శుభవార్త. Samsung Galaxy Z Fold 6 5G ఇప్పుడు రూ. 55,000 కంటే ఎక్కువ తగ్గింపు ధరతో అమ్మకానికి అందుబాటులో ఉంది. అసలు ధర రూ. 1,64,999తో విక్రయాలు జరుపుకుంటున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ. 1,10,000 కంటే తక్కువ ధరకే మీకు లభిస్తుంది. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లు, విక్రయాలపై లభిస్తున్న డీల్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
Samsung Galaxy Z Fold 6 5G ఫీచర్‌లు
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6 5జీ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 6.3 అంగుళాల డిస్‌ప్లే, 7.6 అంగుళాల ఫోల్డబుల్ మెయిన్ స్క్రీన్ ఉన్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 12GB RAM, 512GB స్టోరేజీతో వస్తుంది. అధిక RAM కారణంగా, ఇది మల్టీ టాస్కింగ్, హై-ఎండ్ గేమ్‌లను సులభంగా మేనేజ్ చేస్తుంది. 4400 mAh బ్యాటరీ కలిగి ఉంది. ఫోటోలు, వీడియోల కోసం 50MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్.. 10 MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ముందు వైపు 4 MP అండర్ డిస్‌ప్లే, కవర్ స్క్రీన్‌పై 10MP కెమెరా ఉన్నాయి.
ఈ శాంసంగ్ ఫోన్‌పై భారీ తగ్గింపు
మీరు ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఒరిజనల్ ధర రూ. 1,64,999, అయితే ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 1,12,299కి కొనవచ్చు. దీనిపై నేరుగా రూ. 52,700 తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (Axis Bank Credit Card) ద్వారా రూ. 4,000 ఇన్‌స్టంట్ తగ్గింపు పొందవచ్చు. అన్ని డిస్కౌంట్స్ తరువాత ధర రూ. 1,08,299కి ఫోన్ కొనవచ్చు.
Vivo X Fold3 Proతో కాంపిటీషన్
Samsung Galaxy Z Fold 6 మొబైల్ పలు విషయాల్లో Vivo X Fold3 Proకి పోటీ ఇస్తుంది. Vivo ఫోన్‌లో 8.03 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 6.53 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. 2 డిస్‌ప్లేలు 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 16GB RAMతో పాటు 512GB స్టోరేజీ వస్తుంది. దీని వెనుక భాగంలో 50 MP + 50 MP + 64 MP కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 1,59,999.






















