JioPhone Prima 4G: జియో నుంచి అదిరిపోయే ఫీచర్ ఫోన్, ధర మరీ ఇంత తక్కువా?
టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తెచ్చింది. JioPhone Prima 4G పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 2,599గా కంపెనీ ఫిక్స్ చేసింది.
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో సరికొత్త ఫోన్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. JioPhone Prima 4G పేరుతో తన కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023లో ప్రదర్శనకు ఉంచింది. ప్రస్తుతం JioMart వెబ్ సైట్ అమ్మకానికి తీసుకొచ్చింది. ఇది ఫీచర్ ఫోన్ అయినప్పటికీ, ప్రీమియం డిజైన్ ను ఉపయోగించారు. ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
విడుదల ఎప్పుడు? ధర ఎంత అంటే?
ఇక JioPhone Prima 4G ఫీచర్ ఫోన్ దీపావళి వరకు విడుదల చేయనున్నట్లు జియో వెల్లడించింది. ఢిల్లీ, ముంబై సహా పలు ప్రధాన పట్టణాల్లో ఈ స్మార్ట్ ఫోన్ డెలివరీ చేయనున్నట్లు జియో మార్ట్ తెలిపింది. ఈ సరికొత్త ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తోంది. పసుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. JioPhone Prima 4G Jiomart ఈకామర్స్ వెబ్‌సైట్‌లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధరను రూ.2599గా కంపెనీ ఫిక్స్ చేసింది. లాంచింగ్ సందర్భంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు అందుబాటులోకి తెస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
JioPhone ప్రైమా 4G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
- JioPhone Prima 4G 2.4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 320×240 రిజల్యూషన్ పిక్సెల్స్ తో అందుబాటులోకి రానుంది.
- ఈ ఫోన్ కు TFT డిస్ ప్లే ఉంది. వెనుక ప్యానెల్ మీద రెండు సర్కిల్స్ ఉన్నాయి. అందులో జియో లోగోను ఉంచారు.
- ఈ ఫోన్ లో 128GB మైక్రో SD కార్డును పెట్టుకునే అవకాశం ఉంది.
- JioPhone Prima 4Gలో ముఖ్య ఫీచర్లు పలు సోషల్ మీడియా యాప్‌లకు సపోర్టు చేస్తోంది.
- 4G కనెక్షన్ సపోర్ట్, 1800mAh బ్యాటరీ, 23 భాషలకు మద్దతు ఇవ్వనుంది.
- YouTube, JioTV, Jio Cinema, JioSaavn, JioNews లాంటి ఎంటర్ టైన్మెంట్ యాప్‌లకు మద్దతు ఇస్తుంది.
- JioPhone Prima 4Gలో WhatsApp, Jiochat, Facebook లాంటి సోషల్ మీడియా యాప్‌లను కూడా ఇందులో పొందవచ్చు.
- JioSaavn, JioCinema, JioPay ఫోన్‌లో ముందే లోడ్ చేయబడుతాయి.
- ఇక ఈ హ్యాండ్ సెట్ A53 ప్రాసెసర్, KaiOSతో రన్ అవుతుంది.
- ఈ ఫోన్ FM రేడియోతో పాటు 3.5mm ఆడియో జాక్‌కు సపోర్టు చేస్తుంది.
- ఈ ఫోన్ ఒకే SIM స్లాట్ ను కలిగి ఉంటుంది.
- కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్ వెర్షన్ 5.0 మద్దతు ఉంటుంది.
- ఈ ఫోన్ 1,800mAh బ్యాటరీతో వస్తుంది.
- కెమెరా విషయానికి వస్తే 0.3MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
- ఈ ఫోన్ కు సంబంధించి జియో కంపెనీ ఒక సంవత్సరం వారంటీని అందిస్తోంది.
Read Also: ఇది ఫోనా? పవర్ బ్యాంకా? - 22000 ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్ లాంచ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial