X

Redmi Note 11T 5G: రెడ్‌మీ 5జీ ఫోన్ రూ.15 వేలలోపే .. సేల్ ఈరోజే! ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?

రెడ్‌మీ కొత్త బడ్జెట్ 5జీ ఫోన్ నోట్ 11టీ 5జీ సేల్ మనదేశంలో ఈరోజు జరగనుంది. అమెజాన్‌లో ఈ సేల్ జరగనుంది.

FOLLOW US: 

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో ఇటీవలే లాంచ్ చేసిన రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఈరోజు(డిసెంబర్ 7వ తేదీ) అమెజాన్, ఎంఐ.కాం, ఎంఐ హోం, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. చైనాలో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 11 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.

రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ధర
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గానూ నిర్ణయించారు.

ఈ స్మార్ట్ ఫోన్‌పై లాంచ్ ఆఫర్ కింద దీనిపై రూ.1,000 తగ్గింపు అందించనున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,000 తగ్గింపు లభించనుంది. అంటే ప్రారంభ వేరియంట్‌ను రూ.15 వేలలోపు ధరకే సొంతం చేసుకోవచ్చన్న మాట.

రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు. ఇందులో 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. 

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ర్యామ్ బూస్టర్ ఫీచర్ కూడా ఉంది. దీని ద్వారా ఇన్‌బిల్ట్ స్టోరేజ్ నుంచి 3 జీబీని ర్యామ్‌గా ఉపయోగించుకోవచ్చు. అంటే మొత్తంగా 11 జీబీ వరకు ర్యామ్ పొందవచ్చన్నమాట. 

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల బ్యాకప్‌ను ఇది అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఇన్‌ఫ్రారెడ్(ఐఆర్), యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.87 సెంటీమీటర్లుగానూ, బరువు 195 గ్రాములుగానూ ఉంది.

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Redmi Redmi Note 11T 5G Redmi Note 11T 5G Features Redmi New 5G Phone Redmi Note 11T 5G Specifications Redmi Note 11T 5G Price in India Redmi Note 11T 5G Launched Redmi Cheapest 5G Phone Redmi Note 11T 5G Sale

సంబంధిత కథనాలు

iPhone SE+ 5G: బడ్జెట్‌లోనే 5జీ ఐఫోన్.. వచ్చేది ఎప్పుడంటే?

iPhone SE+ 5G: బడ్జెట్‌లోనే 5జీ ఐఫోన్.. వచ్చేది ఎప్పుడంటే?

Microsoft Surface Pro 8: ల్యాప్‌టాప్‌లానే కాదు ట్యాబ్లెట్‌లానూ వాడచ్చు.. మైక్రోసాఫ్ట్ సూపర్ ల్యాపీ.. రేటు మాత్రం ఘాటు!

Microsoft Surface Pro 8: ల్యాప్‌టాప్‌లానే కాదు ట్యాబ్లెట్‌లానూ వాడచ్చు.. మైక్రోసాఫ్ట్ సూపర్ ల్యాపీ.. రేటు మాత్రం ఘాటు!

Realme Book Enhanced Air: రియల్‌మీ కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Realme Book Enhanced Air: రియల్‌మీ కొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Great Republic Day Sale: స్మార్ట్‌ టీవీ కావాలా? అమెజాన్‌లో 50% ఆఫ్‌.. త్వరపడండి!

Great Republic Day Sale: స్మార్ట్‌ టీవీ కావాలా? అమెజాన్‌లో 50% ఆఫ్‌.. త్వరపడండి!

Ambrane Dots Muse: రూ.1,999కే పూర్తి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Ambrane Dots Muse: రూ.1,999కే పూర్తి వైర్‌లెస్ ఇయర్‌బడ్స్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

టాప్ స్టోరీస్

RRR New Release Date Effect: మెగా హీరోపై 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఎఫెక్ట్... ఏయే సినిమాలు వెనక్కి వెళ్లొచ్చు?

RRR New Release Date Effect: మెగా హీరోపై 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఎఫెక్ట్... ఏయే సినిమాలు వెనక్కి వెళ్లొచ్చు?

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

Groom Slaps Bride: వధువును కొట్టిన వరుడు.. అదే ముహూర్తానికి కజిన్‌ను పెళ్లాడిన యువతి

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Shyam SinghaRoy: నానిని పెళ్లి చేసుకోమని అడిగిన వేశ్య.. వీడియో చూశారా..? 

Priyanka Chopra: ప్రియాంక - నిక్ దంపతులకు పుట్టిన బిడ్డ గురించి ఈ వివరాలు తెలుసా?

Priyanka Chopra: ప్రియాంక - నిక్ దంపతులకు పుట్టిన బిడ్డ గురించి ఈ వివరాలు తెలుసా?