అన్వేషించండి

Redmi Note 10T 5G launch: రెడ్‌మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. రూ.14 వేలలోపే ధర..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ షియోమీ.. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ.. రెడ్‌మీ సిరీస్‌లో తన మొట్టమొదటి 5జీ స్మార్ట్ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ (Redmi Note 10 5G)పేరుతో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఇప్పటికే యూరప్‌లో రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 10టీ 5 జీ, పోకో ఎం 3 ప్రో 5 జీ ఫోన్ల రీబ్రాండెడ్ వెర్షన్‌గా రెడ్‌మి నోట్ 10టీ 5జీ వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు (ట్రిపుల్ రియర్) మరియు హోల్ పంచ్ డిస్ ప్లే ఉన్నాయి. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ (MediaTek Dimensity) 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.  
రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ధర..
ఇది రెండు వేరియంట్లలో రానుంది. వీటిలో 4 జీబీ + 64 జీబీ వేరియంట్ ధర రూ.13,999కాగా, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. ఇది క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ మరియు మింట్ గ్రీన్ రంగులలో లభిస్తుంది. దీనిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ అందించారు.
స్పెసిఫికేషన్లు .. 
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ (1,080 x 2,400 పిక్సెల్స్)+ హోల్ పంచ్ అడాప్టివ్ డిస్‌ప్లే ఉంటుంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 Hzగా ఉంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫోన్‌తో పాటు 22.5W ఫాస్ట్ చార్జర్‌ను అందిస్తారు. యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారితమైన MIUI ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌తో లభిస్తుంది. 


ఫింగర్ ప్రింట్ సెన్సార్‌,  ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ 5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఇది 190 గ్రాములు బరువును కలిగి ఉంది. 

జూలై 26 నుంచి సేల్.. 
జూలై 26 నుంచి అమెజాన్, ఎంఐ డాట్ కామ్ (Mi.com), ఎంఐ హోం స్టోర్స్ సహా పలు ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా దీని సేల్ ప్రారంభం అవుతుంది. ప్రారంభ ఆఫర్ క్రింద ఇన్ స్టాంట్ డిసౌంట్స్ ఇవ్వనున్నట్లు సంస్థ వెల్లడించింది.  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుందని తెలిపింది. కాగా, రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో ఇప్పటికే నోట్ 10, నోట్ 10 ప్రో, నోట్ 10 ప్రో మాక్స్, నోట్ 10 ఎస్ ఫోన్లు రాగా.. తాజాగా ఐదో మోడల్ రిలీజ్ అయింది. 

టాప్ హెడ్ లైన్స్

Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget