Redmi A3X: రూ.ఆరు వేలలోపే రెడ్‌మీ ఏ3ఎక్స్ - లాంచ్ ఎప్పుడంటే?
Redmi Affordable Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను మనదేశంలో త్వరలో లాంచ్ చేయనుంది. అదే రెడ్‌మీ ఏ3ఎక్స్. దీని ధర రూ.ఆరు వేలలోపే ఉండనుంది.
Redmi A3X Launch: రెడ్‌మీ ఏ3ఎక్స్ స్మార్ట్ ఫోన్ షావోమీ గ్లోబల్ వెబ్ సైట్లో లిస్ట్ అయింది. దీన్ని బట్టి ఈ ఫోన్ త్వరలో లాంచ్ అవుతుందని అనుకోవచ్చు. ఈ లిస్టింగ్‌లో దీనికి సంబంధించిన డిజైన్, పూర్తి స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఇది ఒక ఎంట్రీ లెవల్ ఫోన్. ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇందులో 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్, యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌ను అందించారు. మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
పాకిస్తాన్‌లో ఈ ఫోన్ ఇప్పటికే లాంచ్ అయింది. అక్కడ దీని ధరను 18,999 పాకిస్తాన్ రూపాయలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.5,700) నిర్ణయించారు. మనదేశంలో కూడా దీని సేల్ త్వరలో ప్రారంభం కానుంది. రెడ్‌మీ ఏ3 సిరీస్‌లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. అరోరా గ్రీన్, మిడ్‌నైట్ బ్లాక్, మిడ్‌నైట్ వైట్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
రెడ్‌మీ ఏ3ఎక్స్ స్పెసిఫికేషన్లు
ఈ లిస్టింగ్ ప్రకారం రెడ్‌మీ ఏ3ఎక్స్‌లో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంను అందించనున్నారు. ఈ ఫోన్ రెండు మేజర్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్స్ లభించనున్నాయి. ఇందులో 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉంది. వాటర్ డ్రాప్ తరహా డిస్‌ప్లే ఇందులో ఉంది.
Read Also: 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు - మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, సూపర్ సౌండ్‌తో
ఆక్టాకోర్ యూనిసోక్ టీ603 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. 4 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64 జీబీ వరకు ఈఎంఎంసీ 5.1 స్టోరేజ్ అందించారు. ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ద్వారా ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను కూడా మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు ఎక్స్‌ప్యాండ్ చేయవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు క్యూవీజీఏ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.
వైఫై, బ్లూటూత్ వీ4.2, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా రెడ్‌మీ ఏ3ఎక్స్‌లో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, వర్చువల్ యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లుగా ఉంది.
An immersive viewing experience with #RedmiSmartFireTV32 2024 Edition!
— Redmi India (@RedmiIndia) June 6, 2024
With Premium Metal Bezel-Less Design, Fire TV Built-in, Vivid Picture Engine, & more, enjoy content and limitless entertainment all year round.
First sale 11th June, 12 Noon.
👉 https://t.co/9j65wQvTzK pic.twitter.com/PlVAsYWBAP
Also Read: గేమింగ్ హబ్‌గా మారుతున్న యూట్యూబ్ - ప్లేయబుల్స్‌ను లాంచ్ చేసిన కంపెనీ!