TV Under 10000: 10 వేల లోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు - మిడిల్ క్లాస్ కోసం బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, సూపర్ సౌండ్‌తో
ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలో చాలా స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మంచి స్క్రీన్ సైజ్, చక్కటి సౌండ్ తో రూ. 10 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ టీవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
TV Under 10000 In India, Know Variant Models: ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ పెరిగిపోయిన నేపథ్యంలో తక్కువ ధరలో మంచి టీవీలు లభిస్తున్నాయి. బెస్ట్ పిక్చర్ క్వాలిటీ, మంచి సౌండ్ ఎక్స్ పీరియెన్స్, స్మార్ట్ ఫంక్షనాలిటీలతో పాటు చక్కటి లుక్ తో ఆకట్టుకుంటున్నాయి. రూ. 10 వేల లోపు హోం థియేటర్ అనుభవాన్ని అందించే స్మార్ట్ టీవీలేవో ఇప్పుడు చూద్దాం..
రూ. 10 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు
1.VW 32 అంగుళాలు Linux సిరీస్ ఫ్రేమ్‌లెస్ HD LED TV- ధర రూ. 8,000
రూ. 10 వేల లోపు స్మార్ట్ టీవీ తీసుకోవాలి అనుకునేవారికి VW 80 cm టీవీ బెస్ట్ ఆప్షన్. ఈ స్మార్ట్ టీవీ ప్రేమ్ లెస్ తో చూడ్డానికి స్టైలిష్ గా ఉంటుంది. HD క్వాలిటీ పిక్చరైజేషన్ ను కలిగి ఉంటుంది. చక్కటి నావిగేషన్ తో పాటు పాపులర్ యాప్స్, స్ట్రీమింగ్ యాక్సెస్ కోసం Linux ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది. ఈజీ కనెక్టివిటీ కోసం HDMI, USB పోర్టులను కలిగి ఉంటుంది. స్ట్రీమింగ్, బ్రౌజింగ్ కోసం ఇంటర్నెట్ కనెక్టివిటీని పొందే అవకాశం ఉంటుంది. 18 నెలల వారెంటీని అందిస్తుంది. ఎనర్జీ ఎఫిషియెంట్ తో పాటు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ ను కలిగి ఉంటుంది.
2.కొడాక్ 32 అంగుళాలు స్పెషల్ ఎడిషన్ సిరీస్ HD LED TV- ధర రూ. 8,500
రూ. 10 వేల లోపు లభించే స్మార్ట్ టీవీలలో కొడాక్ స్పెషల్ ఎడిషన్ టీవీ ఒకటి. ఈ స్మార్ట్ టీవీ HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. చక్కటి పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది. ఇంటిగ్రేటెడ్ Wi-Fi వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇష్టమైన స్ట్రీమింగ్ అప్లికేషన్లు యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ చూడ్డానికి స్లిమ్ గా, ఆకర్షణీయంగా ఉంటుంది. కనెక్షన్ కోసం HDMI, USBతో పాటు ఇతర పోర్ట్ లను కలిగి ఉంటుంది. హోం థియేటర్ లాంటి అనుభవం కోసం 30W సౌండ్ అవుట్ పుట్ ను కలిగి ఉంటుంది.
3.వెస్టింగ్‌హౌస్ 32 అంగుళాల W2 సిరీస్ HD LED TV- ధర రూ. 9000
ఈ స్మార్ట్ టీవీ కూడా రూ. 10 వేల లోపే లభిస్తుంది. చక్కటి పిక్చర్ క్వాలిటీని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ తో ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుంది. స్మార్ట్ ఫోన్, టాబెట్లను ఈ టీవీకి కనెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. HDMI, USBతో పాటు ఇతర పోర్ట్ లను కలిగి ఉంటుంది. గూగుల్ అసిస్టెంట్ బటన్‌తో కూడిని రిమోట్ ను కలిగి ఉంటుంది. 36W డాల్బీ డిజిటల్ ప్లస్ స్పీకర్ చక్కటి సౌండ్ అనుభూతిని కలిగి ఉంటుంది. పవర్ ఫుల్ క్వాడ్ కోర్ CPUను కలిగి ఉంటుంది.
4.XElectron 32 అంగుళాల ఫ్రేమ్‌లెస్ సిరీస్ HD LED TV- ధర రూ. 8500
ఈ స్మార్ట్ టీవీ కూడా ఫ్రేమ్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. HD డిస్‌ప్లేతో పాటు స్మార్ట్ క్లౌడ్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఆన్ లైన్ స్ట్రీమింగ్ తో పాటు యాప్ లను యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. కనెక్టివిటీ కోసం HDMI, USBతో పాటు ఇతర పోర్టులను కలిగి ఉంటుంది. చక్కటి సౌండ్ అనుభూతి కోసం 20 వాట్స్ అంతర్నిర్మిత సౌండ్ బార్లను కలిగి ఉంటుంది.
5.డయానోరా సిగ్మా 32 అంగుళాలు HD LED TV- ధర రూ. 8700
రూ. 10 వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ టీవీల్లో ఇది ఒకటి. HD క్వాలిటీ కలిగిన స్లిమ్ ప్రొఫైల్ ను కలిగి ఉంటుంది. స్మార్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆన్ లైన్ షోలు, గేమింగ్ అనుభూతిని పొందేందుకు అనుకూలంగా ఉంటుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ను కలిగి ఉంటుంది. 30 వాట్స్ అవుట్ పుట్‌తో అంతర్నిర్మిత సౌండ్ బార్ ను కలిగి ఉంటుంది. 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్‌తో A+ గ్రేడ్ డిస్ ప్లే ప్యానెల్ ను కలిగి ఉంటుంది. అంతర్నిర్మిత క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ తో 400 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందిస్తుంది. తక్కువ విద్యుత్ వినియోగంతో పాటు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ ను కలిగి ఉంటుంది.
Read Also: ఇన్ఫినిక్స్ నుంచి అదిరిపోయే 5జీ ఫోన్ వచ్చేసింది- ధర, ఫీచర్లు ఇవే!