అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Redmi A3: 12 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే - సూపర్ బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన రెడ్‌మీ!

Redmi New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ తన కొత్త బడ్జెట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రెడ్‌మీ ఏ3.

Redmi A3 Launched: రెడ్‌మీ ఏ3 (Redmi A3) స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ బడ్జెట్ ఫోన్ ఇదే. ఇందులో 6.71 అంగుళాల భారీ డిస్‌ప్లేను అందించారు. 6 జీబీ వరకు ర్యామ్ ఉంది. దీన్ని ర్యామ్ ఎక్స్‌టెన్షన్ ద్వారా 12 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉండటం విశేషం. బడ్జెట్ మొబైల్ అయినా యూనిసోక్ కాకుండా పెర్ఫార్మెన్స్ మెరుగ్గా అందించే మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌ను కంపెనీ ఈ ఫోన్‌లో అందించింది.

రెడ్‌మీ ఏ3 ధర (Redmi A3 Price in India)
ఇందులో మూడు వేరియంట్లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,299గా ఉంది. ఇక 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,299గా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడల్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ కొనాలంటే రూ.9,299 పెట్టాల్సిందే.

మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ, ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం అధికారిక వెబ్ సైట్లతో పాటు ఎంఐ హోం స్టోర్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో ఫిబ్రవరి 23వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం అయింది.

రెడ్‌మీ ఏ3 స్పెసిఫికేషన్లు (Redmi A3 Specifications)
ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. రెడ్‌మీ ఏ3లో 6.71 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉండటం విశేషం. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై రెడ్‌మీ ఏ3 రన్ కానుంది. 6 జీబీ ర్యామ్ వరకు ఇందులో అందించారు. అయితే ర్యామ్ ఎక్స్‌టెన్షన్ టెక్నాలజీ ద్వారా 12 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. అంటే 12 జీబీ ర్యామ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే కొనేయచ్చన్న మాట.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతో పాటు మరో సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను ఉంది. 128 జీబీ వరకు స్టోరేజ్‌ను షావోమీ అందించింది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

డ్యూయల్ 4జీ వోల్టే, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా అందించారు. ఎఫ్ఎం రేడియో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో అందుబాటులో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 199 గ్రాములుగా (మిడ్‌నైట్ బ్లాక్, లేక్ బ్లూ కలర్ ఆప్షన్లు) ఉంది. ఆలివ్ గ్రీన్ కలర్ వేరియంట్ బరువు కాస్త తక్కువగా 193 గ్రాములు మాత్రమే.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025: శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
శ్రేయస్ అయ్యర్‌పై కనక వర్షం - ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర
Samantha: చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
చైతూకి ఖరీదైన గిఫ్టుల కోసం బోలెడంత ఖర్చు చేసిన సమంత - మంట పెట్టిన బాలీవుడ్ హీరో ర్యాపిడ్ ఫైర్
IPL Mega Auction 2025: వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
వేలంలో పేసర్ అర్షదీప్ సింగ్‌కు కళ్లు చెదిరే ధర, రైట్ టు మ్యాచ్ కింద తీసుకున్న పంజాబ్ కింగ్స్
Virat Kohli Century: విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
విరాట్ కోహ్లీ శతక గర్జన, ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్ - 12 పరుగులకే ఆసీస్ టాపార్డర్ ఔట్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Crime News: 'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
'అక్కా.. టీచర్ మా ఒంటిపై చేతులు వేస్తున్నారు' - గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహనతో బట్టబయలైన కీచక టీచర్ నిర్వాకం
Embed widget