Realme Narzo N65 5G: రూ.10 వేల రేంజ్‌లోనే 5జీ ఫోన్ - రియల్‌మీ నార్జో ఎన్65 5జీ వచ్చేసింది!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ నార్జో ఎన్65 5జీ. దీని ధర రూ.11,499 నుంచి ప్రారంభం కానుంది.
Realme Narzo N65 5G Launched: రియల్‌మీ నార్జో ఎన్65 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. కంపెనీ నార్జో సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రియల్‌మీ నార్జో ఎన్65 5జీ రన్ కానుంది. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
రియల్‌మీ నార్జో ఎన్65 5జీ ధర (Realme Narzo N65 5G Price in India)
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర రూ.11,499గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ వేరియంట్ ధర రూ.12,499గా నిర్ణయించారు. అమెజాన్, రియల్‌మీ ఇండియా వెబ్‌సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. యాంబర్ గోల్డ్, డీప్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో రియల్‌మీ నార్జో ఎన్65 5జీ అందుబాటులో ఉంది. మే 31వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు దీని సేల్ ప్రారంభం కానుంది. ప్రారంభ ఆఫర్ కింద దీనిపై రూ.1,000 కూపన్ డిస్కౌంట్ అందిస్తున్నారు. దీంతో ఈ ఫోన్‌ను రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు.
Read Also: 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం, ఒక్క ఫోటోతో సినిమా తీసేస్తోంది
రియల్‌మీ నార్జో ఎన్65 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Realme Narzo N65 5G Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 స్కిన్ ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ నార్జో ఎన్65 5జీ పని చేయనుంది. ఇందులో 6.67 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. 6 ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఈ ప్రాసెసర్‌తో లాంచ్ అయిన మొట్టమొదటి ఫోన్ ఇదే అని కంపెనీ అంటోంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా 12 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. 128 జీబీ స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.
5జీ, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. ఇది రివర్స్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ఈ ఫోన్‌లో ఉంది. దీని ద్వారా ఫోన్‌ను తడి చేతులతో కూడా ఆపరేట్ చేయవచ్చు. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.
Read Also: వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్, పొరపాటున ‘డిలీట్ ఫర్ మీ’ కొట్టినా ఇబ్బందేమీ లేదు!