Realme 9 Series: రియల్‌మీ 9, 9 ప్రో ఫీచర్లు లీక్.. ధర రూ.20 వేలలోపే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో కొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ త్వరలో లాంచ్ చేయనుంది. అదే రియల్‌మీ 9 సిరీస్.
రియల్‌మీ 9, రియల్‌మీ 9 ప్రో స్మార్ట్ ఫోన్లు మనదేశంలో త్వరలో లాంచ్ కానున్నాయి. ఈ విషయాన్ని రియల్ మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేఠ్ తెలిపారు. వీటి ధరను కూడా ఆయన టీజ్ చేశారు. రూ.15 వేలకు పైబడిన ధరతోనే ఇవి లాంచ్ కానున్నాయని, వీటిలో 5జీ కనెక్టివిటీ ఉండనుందని తెలిపారు. అంటే రియల్‌మీ 8 సిరీస్ తరహాలోనే దీని ధర కూడా రూ.20 వేలలోపే ఉండనుందన్న మాట. రియల్‌మీ 9 ప్రో కీలక స్పెసిఫికేషన్లు గతంలో లాంచ్ అయ్యాయి.
రియల్‌మీ 9, రియల్‌మీ 9 ప్రో స్మార్ట్ ఫోన్ల గురించి కంపెనీ సీఈవో మాధవ్ సేఠ్ ట్వీట్ చేశారు. వీటిలో ఏ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయాలి అని పోల్ పెట్టారు. పోల్ ముగిసిన అనంతరం రెండిటినీ లాంచ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
వీటి ధర రూ.15 వేలకు పైగా ఉండనుందని మాధవ్ సేఠ్ తెలిపారు. ఈ రెండు ఫోన్లూ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్ సైట్లలో కనిపించాయి. రియల్‌మీ 9 ప్రో కూడా బీఐఎస్ సర్టిఫికేషన్ వెబ్ సైట్లో కనిపించింది. RMX3491 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ ఆన్‌లైన్‌లో కనిపించింది.
రియల్‌మీ 9 ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో 6.59 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
రియల్‌మీ 9 ప్రోలో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సల్ కాగా.. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్ కూడా ఉండనున్నాయి. ముందువైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!
Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!