Realme 9 Pro+: రియల్‌మీ 9 ప్రో ప్లస్ వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. సూపర్ కెమెరాలు!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో తన కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయనుంది. అవే రియల్‌మీ 9 సిరీస్ ఫోన్లు. వీటిలో ఈసారి రియల్‌మీ 9 ప్రో ప్లస్ కూడా ఉండనుందని వార్తలు వస్తున్నాయి.
రియల్‌మీ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో త్వరలో లాంచ్ కానున్నాయి. అయితే రియల్‌మీ 9 సిరీస్‌లో ప్రో ప్లస్ మోడల్ కూడా ఉండనుందని వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ కూడా మనదేశంలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన రెండర్లు, పూర్తి స్పెసిఫికేషన్లు కూడా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.
రియల్‌మీ ఇండియా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ 9 సిరీస్ ఫోన్లను టీజ్ చేసింది. రియల్‌మీ నంబర్ సిరీస్ ఫోన్లలో లాంచ్ కానున్న మొదటి ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ఇదే.
రియల్‌మీ 9 ప్రో ప్లస్ రెండర్లు
ఈ రెండర్లలో ఈ స్మార్ట్ ఫోన్ ముందువైపు, వెనకవైపు చూడవచ్చు. దీన్ని బట్టి ఇందులో మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఉండనుంది. ఇందులో అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉండనుంది. దీని అంచులు సన్నగా ఉండనున్నాయి.
సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు పంచ్ హోల్‌లో సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించనున్నారు. ఫోన్‌కు కుడివైపు పవర్ బటన్, ఎడమవైపు వాల్యూమ్ రాకర్లు ఉండనున్నాయి. మిడ్‌నైట్ బ్లాక్, అరోరా గ్రీన్, సన్‌రైజ్ బ్లూ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ 9, రియల్‌మీ 9 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ల డిజైన్ ఒకేలా ఉండనుంది.
రియల్‌మీ 9 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు
లీకైన వివరాల ప్రకారం.. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 5జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.
Also Read: Realme 9i: రూ.14 వేలలోపే రియల్‌మీ కొత్త ఫోన్.. సూపర్ అనిపించే ఫీచర్లు.. లేటెస్ట్ ప్రాసెసర్ కూడా!
Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!