News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Realme 11 5G: రియల్‌మీ 11 5జీ సేల్ ప్రారంభం - ధర ఎంతంటే?

రియల్‌మీ 11 5జీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్ సైట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

FOLLOW US: 
Share:

రియల్‌మీ ఇటీవలే మనదేశంలో కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 11 5జీ. దీని సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. మొబైల్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో 108 మెగాపిక్సెల్ సెన్సార్ ప్రధాన కెమెరాగా ఉంది.

రియల్‌మీ 11 5జీ ధర ఎంత?
ఈ స్మార్ట్ ఫోన్‌లో రెండు వేరియంట్లు అందుబాటులో అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999గా నిర్ణయించారు. గ్లోరీ గోల్డ్, గ్లోరీ బ్లాక్ కలర్ ఆప్షన్లలో రియల్‌మీ 11 5జీని కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ, లీడింగ్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్ కింద ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులతో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,500 అదనపు తగ్గింపు లభించనుంది.

రియల్‌మీ 11 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ 11 5జీ పని చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ మొబైల్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌ను రియల్‌మీ 11 5జీలో అందించారు. ఇందులో 8 జీబీ ర్యామ్ ఉంది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరింత పెంచుకోవచ్చు. దీని ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు సెన్సార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఇందులో 256 జీబీ వరకు స్టోరేజ్‌ను అందించారు. ఈ స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఫోన్ పక్కభాగంలో ఉంది. డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్‌బై 5జీ కనెక్టివిటీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌ కాగా, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 17 నిమిషాల్లో ఈ ఫోన్ సున్నా నుంచి 50 శాతం ఛార్జింగ్ ఎక్కనుందని కంపెనీ తెలిపింది.

Read Also: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 31 Aug 2023 02:50 PM (IST) Tags: Realme Realme New Phone Realme 11 5G Price in India Realme 11 5G Realme 11 5G Specifications Realme 11 5G Features Realme 11 5G Sale Realme 11 5G Flipkart Sale

ఇవి కూడా చూడండి

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

Google Pixel 8 Series: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ ధర, ఫీచర్లు లీక్ - ఐఫోన్లకు పోటీనిచ్చే కెమెరాలు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!

WiFi Connection: ఇంట్లో వైఫై పెట్టిస్తున్నారా? - ఎంత స్పీడ్ అయితే బెస్ట్!

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

iPhone 15 Series: ఆండ్రాయిడ్ టైప్-సీ ఛార్జర్లతో ఐఫోన్ 15 సిరీస్‌కు ఛార్జింగ్ పెట్టవచ్చా?

Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!

Amazon Prime Ads: అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ గోల - వచ్చే సంవత్సరం నుంచే స్టార్ట్!

టాప్ స్టోరీస్

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

బీజేపీపార్టీ ప్ర‌తినిధా, రాష్ట్ర గవర్నరా ? తమిళిసై పై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

AP CAG: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుపట్టిన కాగ్

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!