News
News
వీడియోలు ఆటలు
X

Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?

రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది.

FOLLOW US: 
Share:

Realme 10 Pro Coca Cola edition: ప్రజలు కోకా కోలా స్మార్ట్‌ఫోన్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు రియల్‌మీ (Realme) తన కోకా కోలా ఎడిషన్ ఫోన్, రియల్‌మీ 10 ప్రో 5జీ (Realme 10 Pro 5G) ని మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే ఇం) దులో మీరు వెనుక వైపున డ్యూయల్ టోన్ డిజైన్‌ను చూడవచ్చు. వెనుక వైపు నలుపు, ఎరుపు కోకా కోలా రంగులను చూడవచ్చు. దీనితో పాటు రెండు కంపెనీల బ్రాండింగ్ వెనుక ప్యానెల్‌లో కనుగొనబడుతుంది.

రియల్‌మీ 10 ప్రో కోకా కోలా ఎడిషన్ ధర (Realme 10 Pro Coca Cola edition Price)
రియల్‌మీ 10 ప్రో 5జీ కోకా కోలా ఎడిషన్ గత సంవత్సరం లాంచ్ అయిన రియల్‌మీ 10 ప్రో 5జీ లాగా ఉంటుంది. వాస్తవానికి కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను గత సంవత్సరం మార్కెట్లోకి విడుదల చేసింది. కంపెనీ కోకా-కోలాతో కలిసి పని చేసినందున, దీని కారణంగా రియల్‌మీ ఈ ఫోన్‌ను మరోసారి కొత్త డిజైన్‌లో లాంచ్ చేసింది. రియల్‌మీ ఈ కొత్త ఫోన్ ధరను రూ.20,999గా నిర్ణయించింది. మీరు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్, రియల్ మీ అధికారిక వెబ్‌సైట్, రియల్ మీ స్టోర్ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
రియల్‌మీ 10 ప్రో కోకా కోలా ఎడిషన్‌లో మీకు 6.7 అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే లభిస్తుంది. ఇది 120hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 695 5G SoCపై పని చేస్తుంది. ఇందులో మీరు 8 జీబీ వరకు ర్యామ్ పొందుతారు.

కెమెరా గురించి చెప్పాలంటే రియల్‌మీ 10 ప్రో కోకా కోలా ఎడిషన్లో  మీరు 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను పొందుతారు. మరో 2-మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండనుంది. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్‌ కెమెరాను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీరు 5000 mAh బ్యాటరీని పొందుతారు. ఇది 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ ఫోన్ బ్యాటరీని 20 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఈరోజు OPPO రెనో 8T మొదటి సేల్
ఇటీవల OPPO తన OPPO రెనో 8T స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈరోజు ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్. Oppo Reno 8T స్మార్ట్ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. అయితే ఎంపిక చేసిన బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే, మీకు 10% తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు కంపెనీ మీ పాత్ ఫోన్‌పై రూ.3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా ఇస్తోంది.

View this post on Instagram
 
A post shared by realme India (@realmeindia)

Published at : 10 Feb 2023 06:31 PM (IST) Tags: Realme Realme New Phone Realme 10 Pro Coca Cola edition Realme 10 Pro Coca Cola edition Price

సంబంధిత కథనాలు

ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?

ChatGPT నుంచి కంటెంట్ మాత్రమే కాదు, డబ్బు కూడా సంపాదింవచ్చు! ఎలాగో తెలుసా?

WWDC 2023: కొత్త ఐప్యాడ్ఓఎస్, వాచ్ఓఎస్, మ్యాక్ఓఎస్ వచ్చేశాయ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

WWDC 2023: కొత్త ఐప్యాడ్ఓఎస్, వాచ్ఓఎస్, మ్యాక్ఓఎస్ వచ్చేశాయ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

MacBook Air: ఇంటెల్ ల్యాప్‌టాప్‌ల కంటే 12 రెట్లు వేగంగా - కొత్త మ్యాక్‌బుక్ లాంచ్ చేసిన యాపిల్!

MacBook Air: ఇంటెల్ ల్యాప్‌టాప్‌ల కంటే 12 రెట్లు వేగంగా - కొత్త మ్యాక్‌బుక్ లాంచ్ చేసిన యాపిల్!

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!