అన్వేషించండి

6జీ లాంచ్ గురించి మాట్లాడిన మోదీ - ఎప్పుడు వస్తుందో కూడా చెప్పేశారు!

మనదేశంలో 6జీ లాంచ్ గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు.

అక్టోబర్ నుంచి మనదేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే 5జీ సేవలు ప్రారంభం కావడానికి ముందే దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 6జీ సేవల గురించి వ్యాఖ్యానించారు. 2030 చివరి నాటికి మనదేశంలో 6జీ సేవలను ప్రారంభించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు మోదీ తెలిపారు.

స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2022 గ్రాండ్ ఫినాలేలో ఈ ప్రకటన వచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఈ దశాబ్దం చివరికి 6జీ లాంచ్ చేయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో భారతీయ సొల్యూషన్స్ తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఇక మనదేశంలో 5జీ రోల్‌అవుట్ మనదేశంలో అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. అక్టోబర్ 12వ తేదీ కల్లా 5జీ సేవలు మనదేశంలో ప్రారంభం అవుతాయని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ గతంలో తెలిపారు. ఈ మేరకు సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం కూడా ఇచ్చారు. మొదటగా 13 నగరాల్లో 5జీ సేవలను అందించనున్నారు.

అహ్మదాబాద్, బెంగళూరు, చండీగర్, చెన్నై, ఢిల్లీ, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, జామ్‌నగర్, కోల్‌కతా, లక్నో, ముంబై, పుణే నగరాల్లో 5జీ సర్వీసులు మొదటగా ప్రారంభం కానున్నాయి. భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, అదానీ డేటా నెట్‌వర్క్స్, వొడాఫోన్ ఐడియాల నుంచి టెలికాం శాఖకు ఇప్పటికే రూ.17,876 కోట్ల మొత్తం అందింది.

పైన పేర్కొన్న 13 నగరాల్లో 5జీ మొదటగా ప్రారంభం కానుంది. ఆ తర్వాత 5జీని దశల వారీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. పూర్తిగా దేశం మొత్తం 5జీ కవరేజ్ రావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. దేశంలో 5జీ టెస్టింగ్ అయితే ఇప్పటికే ప్రారంభం అయింది.

కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇంతవరకు 4జీని అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే 5జీని త్వరలో బీఎస్ఎన్ఎల్ తీసుకురానుందని తెలుస్తోంది. 5జీ సర్వీసుల కోసం బీఎస్ఎన్ఎల్ ఇటీవలే టెలికమ్యూనికేషన్స్ డిపార్టెమెంట్ (డీఓటీ) పర్మిషన్ కోరింది. ఈ పర్మిషన్ వస్తే త్వరలో బీఎస్ఎన్ఎల్ 4జీ, 5జీ అందుబాటులోకి రానున్నాయి.

5జీ ఎన్ఎస్ఏతో రానున్న బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్ 5జీ ఎన్ఎస్ఏ నెట్‌వర్క్స్‌తో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా బేస్ 4జీ కోర్ నెట్‌వర్క్‌ను నిర్మించడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. 5జీ ఎస్ఏ కంటే 5జీ ఎన్ఎస్ఏ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండనుంది. ఎందుకంటే 5జీ ఎస్ఏకు పూర్తిగా కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అంత బడ్జెట్ బీఎస్ఎన్ఎల్ దగ్గర ఉందో లేదో తెలియరాలేదు.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే, బీఎస్ఎన్ఎల్ 5జీ 2023లోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అది బీఎస్ఎన్ఎల్‌కు మంచిదనే చెప్పాలి. 4జీ ఆలస్యం కావడంతో బీఎస్ఎన్ఎల్‌కు చాలా డ్యామేజ్ జరిగింది. దీంతో ప్రభుత్వానికి, బీఎస్ఎన్ఎల్‌కు అప్‌గ్రేడ్ అవ్వడం అత్యవసరం అని తెలిసి ఉంటుంది. ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్ ప్లాన్లలో బీఎస్ఎన్ఎల్ ప్లాన్లే తక్కువ ధరలో ఉన్నాయి. 5జీలో కూడా చవకైన ప్లాన్లు తీసుకొస్తే బీఎస్ఎన్ఎల్ తిరిగి టెలికాం రంగంలో ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఎఫ్ఈ కథనం ప్రకారం బీఎస్ఎన్ఎల్ 70 మెగాహెర్ట్జ్ బ్యాండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే 40 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌కు మాత్రమే అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ సిఫారసులనే టెలికాం డిపార్ట్‌మెంట్ ఫాలో అవుతుంది. 70 మెగాహెర్ట్జ్ ఎయిర్ వేవ్స్‌ను బీఎస్ఎన్ఎల్ కోసం రిజర్వ్ చేస్తే ప్రైవేట్ టెలికాం సంస్థలకు 5జీ ఎయిర్ వేవ్స్ కొరత ఏర్పడుతుంది టెలికాం డిపార్ట్‌మెంట్ అభిప్రాయపడుతోంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
Embed widget