By: ABP Desam | Updated at : 15 Feb 2022 03:57 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. (Image: Poco)
Poco M4 Pro 5G Launched in India: పోకో ఎం4 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. గతేడాది జూన్‌లో మనదేశంలో లాంచ్ అయిన పోకో ఎం3 ప్రో 5జీకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. పోకో ఎం4 ప్రో 5జీలో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను అందించారు. 90 హెర్ట్జ్ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వివో టీ1 5జీ, రియల్‌మీ నార్జో 30 ప్రో, ఒప్పో ఏ74 5జీ, లావా అగ్ని 5జీలతో ఈ ఫోన్ పోటీ పడనుంది.
పోకో ఎం4 ప్రో 5జీ ధర (Poco M4 Pro 5G Price)
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గానూ, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గానూ ఉంది. కూల్ బ్లూ, పోకో ఎల్లో, పవర్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫిబ్రవరి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో దీని సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్‌పై పలు లాంచ్ ఆఫర్లు కూడా ఉండనున్నాయి.
పోకో ఎం4 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (Poco M4 Pro 5G Specifications)
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఫర్ పోకో ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. త్వరలో ఎంఐయూఐ 13 అప్‌డేట్ కూడా రానుందని తెలుస్తోంది. ఇందులో 6.6 అంగుళాల డాట్ డిస్‌ప్లేను అందించారు. 90 హెర్ట్జ్ డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ కూడా ఇందులో అందించడం విశేషం. పోకో ఎం4 ప్రో 5జీలో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌ను అందించారు. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ కూడా ఇందులో ఉంది. 128 జీబీ స్టోరేజ్‌ను కూడా ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.
5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా... బరువు 195 గ్రాములుగా ఉంది.
Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Whatsapp End Support: ఈ ఫోన్లకు వాట్సాప్ ఇక పనిచేయదు - అధికారికంగా తెలిపిన మెటా - మీ మొబైల్స్ ఉన్నాయేమో చూసుకోండి!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
Realme New Tablet: రియల్‌మీ కింగ్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వచ్చేది అప్పుడే - ఫీచర్లు కూడా లీక్!
Telangana CM KCR Bengaluru Tour: నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ- బెంగళూరుకు సీఎం కేసీఆర్, ముచ్చటగా మూడోసారి
Diabetes: అధ్యయనంలో షాకింగ్ రిజల్ట్, టైప్ 2 డయాబెటిస్ ఉంటే మెదడు త్వరగా ముసలిదైపోతుంది
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో వర్షం, ఎల్లో అలర్ట్ జారీ! ఏపీలో నేడు 2-4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు
YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, ఏపీతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ఒప్పందం