Poco C65 Sale: పోకో సీ65 సేల్ ప్రారంభం - రూ.10 వేలలోపే 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్!
Poco C65: పోకో సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Poco C65 Flipkart Sale: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో ఇటీవలే తన కొత్త బడ్జెట్ ఫోన్ అయిన సీ65ను మనదేశంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేయనుంది. 256 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా పోకో సీ65 సపోర్ట్ చేయనుంది.
పోకో సీ65 ధర, ఆఫర్లు
ఈ ఫోన్ మనదేశంలో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.8,499కే కొనుగోలు చేయవచ్చు. హై ఎండ్ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499గానూ, టాప్ ఎండ్ మోడల్ అయిన 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. మ్యాట్ బ్లాక్, పాస్టల్ బ్లూ రంగుల్లో పోకో సీ65 మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది.
ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈఎంఐ లావాదేవీల ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ అందించనున్నారు. అంటే 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.9,999కే కొనేయవచ్చన్న మాట. ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునేవారికి ఈ హైఎండ్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్ కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ప్రారంభం అయింది.
పోకో సీ65 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇలా...
పోకో సీ65లో 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ రేట్ 180 హెర్ట్జ్‌గానూ ఉంది. ఇక యాస్పెక్ట్ రేషియో 20.6:9గా ఉండటం విశేషం. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టంపై పోకో సీ65 పనిచేయనుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం కూడా ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ కానుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందించడం విశేషం.
పోకో సీ65 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లోనాస్ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!