Pebble Cosmos Vogue: రూ.మూడు వేలలోపే ప్రీమియం స్మార్ట్ వాచ్ - లాంచ్ చేసిన ప్రముఖ బ్రాండ్!
పెబుల్ కాస్మోస్ వోగ్ స్మార్ట్ వాచ్ మన దేశంలో లాంచ్ అయింది.
![Pebble Cosmos Vogue: రూ.మూడు వేలలోపే ప్రీమియం స్మార్ట్ వాచ్ - లాంచ్ చేసిన ప్రముఖ బ్రాండ్! Pebble Cosmos Vogue Smartwatch Launched in India With AMOLED Display Magnetic Straps Check Price Specifications Features Pebble Cosmos Vogue: రూ.మూడు వేలలోపే ప్రీమియం స్మార్ట్ వాచ్ - లాంచ్ చేసిన ప్రముఖ బ్రాండ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/19/d68dad37b1aeaddba7f1504b90b4c0b41687167701659252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రముఖ బ్రాండ్ పెబుల్ మన దేశంలో కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. అదే పెబుల్ కాస్మోస్ వోగ్ స్మార్ట్ వాచ్. ఇందులో 1.96 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఈ వాచ్ అందించనుంది. మ్యాగ్నటిక్ స్ట్రాప్, రొటేటింగ్ క్రౌన్‌తో ఈ వాచ్ రానుంది. బ్లూటూత్ కాలింగ్, మల్టీపుల్ స్పోర్ట్స్ మోడ్స్, ఎన్నో వాచ్ ఫేసెస్ ఇందులో ఉన్నాయి.
పెబుల్ కాస్మోస్ వోగ్ ధర
ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ప్రైస్‌ను మనదేశంలో రూ.2,499గా నిర్ణయించారు. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. జెట్ బ్లాక్, మిడ్ నైట్ బ్లూ, ఆబ్సిడియన్ బ్లాక్, క్లాసిక్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ఈ వాచ్ లాంచ్ అయింది.
పెబుల్ కాస్మోస్ వోగ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న మెటాలిక్ డయల్‌ను అందించారు. దీని అంచులు గుండ్రంగా ఉండనున్నాయి. సిలికాన్, మెటాలిక్ మ్యాగ్నెటిక్ స్ట్రాప్స్ దీంతో పాటు అందించనున్నారు. 1.96 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను ఈ వాచ్‌లో అందించనున్నారు. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్ కూడా ఈ ఫోన్‌లో ఉండనుంది. బ్లూటూత్ కాలింగ్ ద్వారా వినియోగదారులు కాల్స్ రిసీవ్ కూడా చేసుకోవచ్చు. ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఈ వాచ్ సపోర్ట్ చేయనుంది.
దీంతో పాటు ఎస్‌పీఓ2 మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. మల్టీపుల్ స్పోర్ట్స్ మోడ్స్, యాక్టివిటీ ట్రాకర్లు కూడా అందించారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 రేటింగ్‌తో ఈ వాచ్ లాంచ్ అయింది.
దీని బ్యాటరీ సామర్థ్యం 240 ఎంఏహెచ్‌గా ఉంది. వైర్డ్ మ్యాగ్నటిక్ ఛార్జింగ్‌ను ఈ వాచ్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏడు రోజుల రెగ్యులర్‌గా ఈ వాచ్ వాడుకోవచ్చు. అలారం, జెన్ మోడ్, డిస్‌ప్లే టైమర్, స్టెప్ పీడోమీటర్, ఇంటర్‌ఛేంజబుల్ స్ట్రాప్స్, కాల్స్, ఎస్ఎంఎస్, వాట్సాప్, సోషల్ మీడియాకు నోటిఫికేషన్లు కూడా ఉండనున్నాయి.
Pebble Cosmos Vogue launched for ₹2,499 in India. pic.twitter.com/P3QeUrQvEl
— Mukul Sharma (@stufflistings) June 17, 2023
Pebble Cosmos Vogue launched for ₹2,499 in India.
— ig.techhub (@Ig_techhub) June 17, 2023
Colour : Jet Black, Midnight Blue, Obsidian Black, Classic Gold
1.96" (4.97 cm)
Amoled BT Calling
Silicone, Metal
Amoled
Magnetic Charging
240 battery
Bluetooth Version 5,
Battery Average Life 7days
IP67
Metal Alloy#pebble pic.twitter.com/xXnsiL9UFX
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)