ChatGPT Down Memes: స్తంభించిన చాట్ జీపీటీ, ఇప్పుడు ఈ వర్క్ ఎలా చేయాలి? ఫన్నీ మీమ్స్ వైరల్
ChatGPT is a generative artificial intelligence chatbot | ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ సేవలు ప్రపంచ వ్యాప్తంగా స్తంభించాయి. నిత్యం దానిమీదే ఆధారపడిన వారి బాధ వర్ణణాతీతం. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి.

OpenAI Server Down: డిజిటల్ ప్రపంచం మంగళవారం నాడు ఒక్కసారిగా స్తంభించిపోయింది. OpenAI ముఖ్యమైన సేవలు ChatGPT, విప్లవాత్మకమైన సోరా వీడియో మోడల్ సేవలు నిలిచిపోయాయి. ఇది కేవలం సాంకేతిక లోపం మాత్రమే కాదు, సోషల్ మీడియాను ఇది షేక్ చేసేసింది. పలు సంస్థల ప్లాట్‌ఫారమ్స్ పనులు ఒక్కసారిగా నిలిచిపోయాయి.
సామ్ ఆల్ట్‌మన్ నేతృత్వంలోని సంస్థ త్వరగా సమస్యను గుర్తించింది. దాని ప్లాట్‌ఫారమ్ సేవలలో జాప్యం సాంకేతిక లోపం ద్వారా జరిగింది.. 2025 చివరి నాటికి ఒక బిలియన్ ChatGPT వినియోగదారులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ, మంగళవారం సేవలలో అంతరాయం తలెత్తింది. దాంతో ఓపెన్ ఏఐకి ఏం జరిగింది అని నిపుణులు సమస్యను గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.
OpenAI అధికారిక ప్రకటనకు దాదాపు నాలుగు గంటల ముందు సమస్య ప్రారంభమైంది. ఓపెన్ ఐఏ చాట్ జీపీటీ సేవలు నిలిచిపోవడంతో పలు రంగాల్లో ఇది ప్రకంపనలు సృష్టించింది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు, పలు సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఎక్కువగా AIని వినియోగిస్తున్నారు. చాట్ జీపీటీ వర్క్ కావడం లేదని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు..
డిజిటల్ విరామం
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్‌లోో మంగళవారం నాడు టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో డిజిటల్ విరామం దొరింది. కానీ దాని మీదే డిపెండ్ అయిన వారికి సమస్యలు తలెత్తాయి. క్రియేటెవ్ కంటెంట్ నుంచి సంక్లిష్టమైన డేటా విశ్లేషణను క్రమబద్ధీకరించడం వరకు ఎన్నో రకాలుగా చాట్ జీపీటీని వినియోగిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్
చాట్‌జీపీటీలో టెక్నికల్ ప్రాబ్లమ్ రాగానే పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. వినియోగదారులు తమ నిరాశను, సమస్యను వ్యక్తం చేయడానికి ఎక్స్, ఫేస్ బుక్‌లో పోస్టులు చేశారు. ఓపెన్ AI పనిచేయకపోవడంతో మీమ్ టెంప్లేట్‌లలో కొన్ని మళ్లీ వాడేశారు. వాడకం అంటే ఇది అన్నట్లు కొందరు, ఇది చాలా పెద్ద ప్రాబ్లమ్ అని మరికొందరు రియాక్ట్ అయ్యారు.
Me when Chat GPT is down:😔😣#ChatGPT #OpenAI pic.twitter.com/vXKXL6Ix03
— Sarcasm (@sarcastic_us) June 10, 2025
మరొకటి వెబ్ సిరీస్ పంచాయత్ నుండి పోస్ట్ చేశారు
me and my friends when chatgpt is down and we have forgotten how to talk to eachother anymore #ChatGPT pic.twitter.com/EpjDUrvJ5M
— SwatKat💃 (@swatic12) June 10, 2025
ChatGPT లేకుండా ఇమెయిల్ ఎలా రాయాలి? కొందరు ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఛాట్‌జీపీటీ ఉండటంతో ఈజీగా పని పూర్తయ్యేది.
#ChatGPTdown
— UmdarTamker (@UmdarTamker) June 10, 2025
My boss when asked to write an email when chatgpt is down : pic.twitter.com/IbbMY9a5NQ
Chat GPT is down!😭
— KGeN Community (@KGeN_Community) June 10, 2025
My career's on a halt rn. pic.twitter.com/2Hjen3gtXG
ఒక గ్లోబల్ అంతరాయం
"నా పని స్నేహితుడు మళ్లీ డౌన్ అయ్యాడు." OpenAI సేవలు టెక్నికల్ ప్రాబ్లం ఎదుర్కొన్నప్పుడు చాలా మంది దాని ప్రతికూల ఫలితాన్ని చూశారు. తమకు మాత్రమే ఇలా అయిందా, అందరికీ ఛాట్ జీపీటీ రావడం లేదా తెలుసుకునేందుకు ఎక్స్ మీద పడ్డారు. "చాట్‌జిపిటి ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. నా ఇంటర్నెట్ గ్లిచ్ అని భావించాను.అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.






















