By: ABP Desam | Updated at : 08 Feb 2023 06:14 PM (IST)
వన్‌ప్లస్ ప్యాడ్ మనదేశంలో లాంచ్ అయింది.
OnePlus Pad Launch: వన్‌ప్లస్ తన మొదటి ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను లాంచ్ చేసింది. ఈ ట్యాబ్ 144hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 11 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ప్యాడ్‌లో వెనుకవైపు ఒకే కెమెరాను అందించనున్నారు. అది సరిగ్గా మధ్యలో ఉంది. ఈ ప్యాడ్‌ను ఎక్కువ సేపు ఉపయోగించినా ప్రజలు దానిని పట్టుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదని, వారు ఇందులో సౌకర్యవంతంగా పని చేయగలుగుతారని కంపెనీ పేర్కొంది.
వన్‌ప్లస్ ప్యాడ్ బ్యాటరీ వివరాలు
వన్‌ప్లస్ ప్యాడ్ 9,510 mAh బ్యాటరీని కలిగి ఉంది. 67W సూపర్ వూక్ చార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. అంటే 60 నిమిషాల్లోనే ఒకటి నుంచి 90 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చన్న మాట.
వన్‌ప్లస్ ప్యాడ్ ప్రాసెసర్, డిస్‌ప్లే
మీడియాటెక్ డైమెన్సిటీ 9000 SoC ప్రాసెసర్, 12 జీబీ ర్యామ్‌లను OnePlus ప్యాడ్‌లో అందించారు. ఇందులో 144 Hz రిఫ్రెష్ రేట్, 7: 5 యాస్పెక్ట్ రేషియో, 2800 x 2000 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన 11.61-అంగుళాల స్క్రీన్ ఉంది.
వన్‌ప్లస్ ప్యాడ్ ప్రత్యేకత
వన్‌ప్లస్ ప్యాడ్ ఫైల్ షేరింగ్, మల్టీ టాస్కింగ్ కోసం స్మార్ట్ సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. వన్‌ప్లస్ ప్యాడ్‌లోని ఆడియో సిస్టమ్ కోసం డాల్బీతో వన్‌ప్లస్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో మీరు గొప్ప సౌండ్‌ను అందించే నాలుగు స్పీకర్లను పొందుతారు.
ధర, కలర్ ఆప్షన్లు
వన్‌ప్లస్ ప్యాడ్ సింగిల్ హాలో గ్రీన్ కలర్‌లో లాంచ్ అయింది. అయితే ఈ ప్యాడ్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే ఇంటర్నెట్‌లో అందించిన సమాచారం ప్రకారం ఇది రూ.24,999కి అందుబాటులో ఉండనుంది. ఖచ్చితమైన సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌పై ఓ లుక్కేయండి.
వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ ధరను ఇటీవలే మనదేశంలో భారీగా తగ్గించారు. దీని ధర ఏకంగా రూ.ఐదు వేలు మేరకు తగ్గింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999 నుంచి రూ.61,999కు తగ్గింది. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.71,999కు తగ్గించారు. వన్‌ప్లస్ 11 స్మార్ట్ ఫోన్‌ను క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది. 2023 ప్రారంభంలో ఈ ఫోన్ లాంచ్ కానుంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. ఇందులో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 20.1:9గా ఉంది. డైనమిక్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను వన్‌ప్లస్ ఇందులో అందించింది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. డిస్‌ప్లే ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్యానెల్‌ను కూడా ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్789 సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ శాంసంగ్ ఐసోసెల్ జేఎన్1 సెన్సార్‌ను అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాగానూ, మరో 8 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్‌ను కూడా ఇందులో అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 కెమెరాను ఇందులో అందించారు. ఈ ఫోన్ 8కే వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!
Samsung F14 5G: రూ.13 వేలలోపే శాంసంగ్ 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Jio IPL Plans: రూ.219కే రోజూ 3 జీబీ డేటా - అదనంగా 2 జీబీ కూడా - ఐపీఎల్ ముందు జియో కొత్త ప్లాన్లు!
Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!
Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?
1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్