X

OnePlus 9RT: వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేసింది.. 9 సిరీస్ ఫీచర్లు.. కానీ వాటి కంటే తక్కువ ధరకే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మనదేశంలో తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ 9ఆర్‌టీ.

FOLLOW US: 

వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో లేటెస్ట్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ను అందించారు. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఇందులో ఉంది.

వన్‌ప్లస్ 9ఆర్‌టీ ధర
ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.42,999గా నిర్ణయించారు. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.46,999గా నిర్ణయించారు. హ్యాకర్ బ్లాక్, నానో సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. జనవరి 17వ తేదీ నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం వన్‌ప్లస్ 9 ప్రారంభ వేరియంట్ ధర 

వన్‌ప్లస్ 9ఆర్‌టీ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. టచ్ శాంప్లింగ్ రేట్ ఏకంగా 1,300 హెర్ట్జ్‌గా ఉండటం విశేషం. హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో ఫోన్‌ను ఆటోమేటిక్‌గా కూల్ చేసే స్పేస్ కూలింగ్ టెక్నాలజీని కూడా అందించారు.

కెమెరాల విషయానికి వస్తే.. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 198.5 గ్రాములుగా ఉంది.

Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Oneplus OnePlus 9RT OnePlus New Phone OnePlus 9RT Specifications OnePlus 9RT Features OnePlus 9RT Price in India OnePlus 9RT Launched

సంబంధిత కథనాలు

Vivo Y75 5G: 12 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 12, 5జీతో వివో కొత్త ఫోన్.. ధర రూ.22 వేలలోపే!

Vivo Y75 5G: 12 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 12, 5జీతో వివో కొత్త ఫోన్.. ధర రూ.22 వేలలోపే!

Google Chromecast: రూ.3 వేలలోపే గూగుల్ క్రోమ్‌కాస్ట్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Google Chromecast: రూ.3 వేలలోపే గూగుల్ క్రోమ్‌కాస్ట్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Sony Neckband Speakers: ఈ స్పీకర్లను మెడలో వేసుకోవచ్చు.. అదిరిపోయే ఫీచర్లు!

Sony Neckband Speakers: ఈ స్పీకర్లను మెడలో వేసుకోవచ్చు.. అదిరిపోయే ఫీచర్లు!

Tata Sky Renamed: 'స్కై' నుంచి 'ప్లే'కు మారిన టాటా! సర్వీస్‌ విజిట్‌ ఛార్జీలు రద్దు!!

Tata Sky Renamed: 'స్కై' నుంచి 'ప్లే'కు మారిన టాటా! సర్వీస్‌ విజిట్‌ ఛార్జీలు రద్దు!!

Poco New Phone: 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ ఫీచర్లతో పోకో కొత్త ఫోన్.. లాంచ్ త్వరలోనే!

Poco New Phone: 108 మెగాపిక్సెల్ కెమెరా, 5జీ ఫీచర్లతో పోకో కొత్త ఫోన్.. లాంచ్ త్వరలోనే!

టాప్ స్టోరీస్

Vaccine: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం

Vaccine: ‘వ్యాక్సిన్ వేసుకోకపోవడం నా తప్పే’... కరోనాతో మరణించడానికి కొన్ని క్షణాల ముందు ఓ తండ్రి పశ్చాత్తాపం

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Stock Markets Crash: రక్త మోడుతోంది! సెన్సెక్స్‌ 1300, నిఫ్టీ 400 డౌన్‌.. మదుపర్ల కంటనీరు!!

Plastic Surgery Tragedy : 75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ.. బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే "ఐ"లో విక్రమ్ అయ్యాడు ! ఇప్పుడు దారేంటి ?

Plastic Surgery Tragedy :  75 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ సర్జరీ..  బ్రాట్ పిట్ అవుతాడనుకుంటే

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!

Charanjit Singh Death: హాకీ దిగ్గజం చరణ్‌జిత్ మృతి.. ఒలంపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టుకు కెప్టెన్!