Allu Arjun: అల్లు అర్జున్ ఇమేజ్‌కు డ్యామేజ్... రంగంలోకి దిగిన టీం - లీగల్ యాక్షన్‌కు రెడీ!
Allu Arjun Team Statement: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకూడదని, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, ఇలా టోటల్ 42 కండిషన్స్ ఉన్నాయని ఓ మహిళ చెప్పిన వీడియో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం అట్లీ ప్రాజెక్టుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. అయితే అల్లు అర్జున్ మీద నిత్యం ఏదో ఒక టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటుంది. తాజాగా బన్నీ ఇమేజ్‌కు డ్యామేజ్ కలిగించేలా బాలీవుడ్ నుంచి ఓ మహిళ కామెంట్లు చేసింది. ఆమె తన పాడ్ కాస్ట్‌లో చాలా విషయాలు చెప్పేది. బన్నీని కలవాలంటే ఎన్నో కండీషన్లు అంటూ ఇష్టమొచ్చినట్టుగా చెప్పేసింది. దీంతో బన్నీ వ్యవహార శైలి మీద రకరకాల రూమర్లు నడిచాయి. అయితే వెంటనే ఆ వార్తలకు అల్లు అర్జున్ టీం పుల్ స్టాప్ పెట్టేసింది.
అల్లు అర్జున్ కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదని, ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని, ఇలా 42 కండిషన్స్ ఉన్నాయని సదరు మహిళ చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ మేనేజర్‌కి మేనేజర్ లాంటి ఓ వ్యక్తిని సంప్రదించానని, అతను బన్నీని కలిసేందుకు రకరకాల కండీషన్స్ పెట్టాడటని సదరు నటి చెప్పుకొచ్చింది. బన్నీతో ఐ కాంటాక్ట్ ఇవ్వకూడదని, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకూడదని ఇలా రకరకాల కండీషన్స్ పెట్టారని బన్నీ ఇమేజ్‌కి డ్యామేజ్ కలిగించేలా సదరు నటి కామెంట్లు చేసింది. ఒక్కసారిగా ఈ పాడ్ కాస్ట్, దానికి సంబంధించిన వీడియో ఇంటర్వ్యూ వైరల్ అయింది. అయితే ఈ తప్పుడు వార్తల్ని ఖండించే క్రమంలో అల్లు అర్జున్ టీం ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
''రీసెంట్‌గా అల్లు అర్జున్ మీద చేసిన ఆరోపణలు, కామెంట్లు అన్నీ కూడా అవాస్తవం. ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి గౌరవ మర్యాదల్ని సంపాదించుకున్నారు. ఇలాంటి తప్పుడు వార్తల్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నాం. లీగల్ టీం ద్వారా తగిన చర్యల్ని తీసుకుంటాం. ఏది వాస్తవం? ఏది అవాస్తవం? అని తెలుసుకోకుండా ప్రచారాలు చేయొద్దని కోరుతున్నాం'' అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అల్లు అర్జున్ టీమ్.
బన్నీ ప్రస్తుతం అట్లీ మూవీతో ముంబైలో బిజీగా ఉన్నాడు. ఆ సమ్మర్‌లో తన పార్ట్‌కి సంబంధించిన షూటింగ్ ఫినిష్ చేసి.. ఆ తరువాత లోకేష్ కనకరాజ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టాలని బన్నీ చూస్తున్నాడు. మరి బన్నీ లైనప్ మీద జరుగుతున్న చర్చల గురించి అందరికీ తెలిసిందే. నెక్ట్స్ సందీప్ రెడ్డి వంగా, రాజమౌళితోనే బన్నీ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. ప్రజెంట్ ఆయన పాన్ ఇండియా సినిమాలపై కాన్సంట్రేట్ చేసిన సంగతి తెలిసిందే.























