అన్వేషించండి

AI digital rules: ఏఐ కంటెంట్‌పై లేబులింగ్ తప్పనిసరి - బాధ్యత సోషల్ మీడియా సంస్థలదే - కేంద్రం ఆదేశాలు

AI synthetic content : కేంద్ర ప్రభుత్వం డిజిటల్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కృత్రిమ మేధ సృష్టించిన కంటెంట్‌పై కీలక ఆదేశాలు జారీ చేసింది. సింథటిక్ కంటెంట్‌కు గుర్తింపు తప్పనిసరి చేసింది.

Govt tightens digital rules on AI mandates labelling: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలను అమల్లోకి తెస్తోంది. ఇకపై ఏఐ  ద్వారా సృష్టించిన లేదా మార్పులు చేసిన ఫోటోలు, వీడియోలు, ఆడియోలు వంటి సింథటిక్ కంటెంట్‌ ను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు విధిగా గుర్తించాలి. అటువంటి కంటెంట్‌పై ఇది ఏఐ ద్వారా సృష్టించారని స్పష్టంగా తెలిసేలా  లేబులింగ్ లేదా  వాటర్‌మార్క్ వేయడం తప్పనిసరి చేసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లదే బాధ్యత 

ఈ కొత్త నిబంధనల ప్రకారం, వినియోగదారులు అప్‌లోడ్ చేసే కంటెంట్ ఏఐ సృష్టించినదా కాదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత పూర్తిగా ఫేస్‌బుక్, ఎక్స్  , ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలదే. ఒకవేళ ప్లాట్‌ఫారమ్‌లు అటువంటి కంటెంట్‌ను గుర్తించడంలో లేదా లేబుల్ చేయడంలో విఫలమైతే, ఐటీ చట్టం కింద వారికి లభించే  సేఫ్ హార్బర్ వినియోగదారుల పోస్టులకు కంపెనీ బాధ్యత వహించనక్కర్లేదు అనే వెసులుబాటు  రక్షణను కోల్పోయే అవకాశం ఉంది.                              

డీప్‌ఫేక్ అరాచకాలకు అడ్డుకట్ట

ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల ముఖాలను మార్చి సృష్టిస్తున్న డీప్‌ఫేక్ వీడియోల వల్ల ఎదురవుతున్న ముప్పును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఏఐ కంటెంట్‌ను ముందే గుర్తించడం ద్వారా ప్రజలు తప్పుదోవ పట్టకుండా చూడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సామాజిక మాధ్యమాలు తమ అల్గారిథమ్స్‌ను మార్చుకుని, ఏఐ కంటెంట్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖ సూచించింది.  కేవలం మానవ పర్యవేక్షణ ద్వారా లక్షల సంఖ్యలో అప్‌లోడ్ అయ్యే వీడియోలను తనిఖీ చేయడం సాధ్యం కాదు. అందుకే, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ అల్గారిథమ్స్‌లో మార్పులు చేసి,  AI-ఆధారిత డిటెక్టర్లను  ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. అంటే, ఒక వీడియో ఏఐతో తయారైందో లేదో మరో ఏఐ ప్రోగ్రామ్ సెకన్లలో గుర్తించి, దానికి వెంటనే ఒక  వార్నింగ్ ట్యాగ్ను జత చేస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఏఐ సహాయంతో సృష్టించిన ఏ కంటెంట్ అయినా సరే, అది  సింథటిక్  అని స్పష్టంగా తెలియజేయాలి. వీడియో మూలల్లో వాటర్‌మార్క్‌లు వేయడం లేదా వివరణాత్మక లేబుల్స్ ఇవ్వడం ద్వారా సామాన్య ప్రజలు అది నిజమైన వీడియో కాదని సులభంగా గ్రహించగలరు. దీనివల్ల సమాజంలో అనవసరమైన ఆందోళనలు, అల్లర్లు రేగకుండా అడ్డుకోవచ్చు.

వినియోగదారుల భద్రతే లక్ష్యం 
 
డిజిటల్ ప్రపంచంలో విశ్వసనీయతను పెంచడం , ఇంటర్నెట్ వినియోగదారుల భద్రతను కాపాడటం ఈ చర్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. తప్పుడు సమాచారం  దేశ భద్రతకు లేదా సామాజిక సామరస్యానికి భంగం కలిగించకుండా ఉండాలంటే పారదర్శకత అవసరమని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. 

టాప్ హెడ్ లైన్స్

Aus vs Eng World Cup Final: నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
ABP Desam Top 10, 5 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 5 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
KTR On Polavaram Project: దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
దశాబ్దాలు గడిచినా పోలవరం పూర్తి కాలేదు.. కాలంతో పోటీపడి కాళేశ్వరం నిర్మించాం: కేటీఆర్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aus vs Eng World Cup Final: నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ డీసెంట్ స్కోరు.. ఆసీస్ బౌలర్ల ధాటికి టాప్ ఆర్డర్ కొల్లాప్స్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget