FIA Dance Pe Chance: గడ్డకట్టే చలిలోనూ చిన్నారుల అద్భుత ప్రదర్శన, వైభవంగా FIA 'డ్యాన్స్ పే ఛాన్స్'!
FIAs 42nd Dance Pe Chance : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ 43వ 'డ్యాన్స్ పే ఛాన్స్' అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. గడ్డకట్టే చలిలో కూడా 870 మంది భారత చిన్నారులు ప్రతిభను చాటారు.

Dance Pe Chance : అమెరికాలోని న్యూజెర్సీ వేదికగా ఇండియన్ అసోసియేషన్స్ ఫెడరేషన్ (FIA-NY-NJ-CT-NE) డాన్స్ పే చాన్స్ (DPC) 42వ ఎడిషన్ ను విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం 2026 ఫిబ్రవరి 7న శనివారం న్యూజెర్సీలో ట్రెంటన్ లో ప్యాట్రియట్స్ థియేటర్ అట్ ది మొమోరియల్ లో జరిగింది. బారత 77న గణతంత్ర దినోత్సవం సందర్భంగా వందేమాతరం 150 వార్షికోత్సవంలో భాగంగా ఈ ఈవెంట్ జరిగింది.
అమెరికాలోని అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ అమెరికన్ డ్యాన్స్ కాంపిటీషన్2లో ఇది ఒకటిగా నిలిచింది. చలికాలంలో సబ్‌జీరో విండ్ చిల్స్ ఉన్నప్పటికీ, 2,200 మందికి పైగా ప్రముఖులు, కమ్యూనిటీ నాయకులు, సాంస్కృతిక ఔత్సాహికులు హాజరయ్యారు.
కార్యక్రమం జాతీయ గీతాలతో ప్రారంభమైంది. ఆ తర్వాత FIA లక్ష్యాలు, సాధనల గురించి ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. భారతీయ శాస్త్రీయ, జానపద, బాలీవుడ్, కంటెంపరరీ నృత్య రూపాలతో అద్భుతమైన, స్ఫూర్తినిచ్చే ప్రదర్శనలు జరిగాయి. DPC చైర్మన్ ప్రీతి రే-పటేల్ డాన్స్ పే చాన్స్ నాలుగు దశాబ్దాల వారసత్వం గురించి మాట్లాడారు. FIA అధ్యక్షుడు శ్రీకాంత్ అక్కపల్లి ఈ ఏడాది మైలురాళ్లు, వాలంటీర్ల పాత్ర గురించి వివరించారు. FIA చైర్మన్ అంకుర్ వైద్య భారత డయాస్పోరాకు ఐక్యతా శక్తిగా FIA అభివృద్ధి గురించి మాట్లాడారు.
FIA 2026 ఎగ్జిక్యూటివ్ కమిటీకి భారత గౌరవ కాన్సుల్ జనరల్‌గా అంబ్. బినయ్ ఎస్. ప్రధాన్ ప్రమాణ స్వీకారం ఈవెంట్‌లో ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. ఆయన తన ప్రసంగంలో FIA ఈవెంట్‌ల స్థాయి, ప్రభావాన్ని ప్రశంసించారు. భారత డయాస్పోరా అవసరాలకు అనుగుణంగా కాన్సులర్ సేవలు విస్తరిస్తున్నట్లు చెప్పారు.న్యూయార్క్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ విశాల్ జె హర్ష్ కూడా హాజరై, FIA సాంస్కృతిక రక్షణ, డయాస్పోరా ఎంగేజ్‌మెంట్‌పై నిబద్ధతను అభినందించారు.
ఈ పోటీని ప్రముఖ నటి పద్మిని కొల్హాపురే, ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ సుప్రియా దోషి, ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య కళాకారిణి ఆంటిమా చక్రవర్తిలతో కూడిన విశిష్ట ప్యానెల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ఏడాది 18 ప్రముఖ డాన్స్ అకాడమీల నుంచి దాదాపు 870 మంది పాల్గొన్నారు. మైనర్, జూనియర్, సీనియర్, అడల్ట్ కేటగిరీల్లో 31 ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చారు. గడ్డకట్టే చలిని కూడా లెక్కచేయకుండా చిన్నారులు ప్రతిభ చాటారు. భారత సంస్కృతిని, కళలను విదేశాల్లోనూ విస్తరించేందుకు ఈ పోటీలు నిర్వహించారు. గ్రాండ్ ఫినాలేలో 100 మందికి పైగా అంకితభావంతో పనిచేసిన వాలంటీర్లను గుర్తించారు. తర్వాత బెస్ట్ కొరియోగ్రఫీ, థీమాటిక్ ఇన్నోవేషన్, అవుట్‌స్టాండింగ్ స్పిరిట్ వంటి కేటగిరీల్లో విజేతలకు అవార్డులు అందజేశారు.
FIA నాయకత్వం డాన్స్ పే చాన్స్ను తరాలకు వారధిగా చేస్తూ, ఇండో అమెరికన్ సమాజంలో సాంస్కృతిక వారసత్వం, యువత నాయకత్వం, కళాత్మక నైపుణ్యాన్ని పెంపొందిస్తూ కొనసాగుతుందని పునరుద్ఘాటించింది. 2027లో 43వ ఎడిషన్ కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి, మరింత అద్భుతమైన వేడుక జరుగుతుందని తెలిపారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA-NY-NJ-CT-NE) ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లో ఇండో అమెరికన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ లాభాపేక్షలేని సంస్థ. సాంస్కృతిక, సామాజిక, సేవా కార్యక్రమాల ద్వారా వారసత్వాన్ని కాపాడటం, ఐక్యతను ప్రోత్సహించడం, భారత డయాస్పోరా సహకారాన్ని జరుపుకోవడం దీని లక్ష్యం.
900 young artists performing different forms of Indian dance; Consul General @binaysrikant76 attended @FIANYNJCTNE ’s 42nd Annual Dance Pe Chance, a cultural dance competition in Trenton, New Jersey, organized in association with @IndiainNewYork, in commemoration of India’s 77th… pic.twitter.com/p1hXWiXJQL
— India in New York (@IndiainNewYork) February 8, 2026
























