Sumanth: సుమంత్ సినిమాకు భారీ బడ్జెట్... ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్
Mahendragiri Varahi: ఇప్పుడు తెలుగు సినిమా పరిధి పెరిగింది. దాంతో దర్శక రచయితల కథలపై నమ్మకం కుదిరితే కోట్లకు ఖర్చు చేయడానికి నిర్మాతలకు ముందుకు వస్తున్నారు. సుమంత్ సినిమాను భారీగా తీస్తున్నారు.

ఇప్పుడు తెలుగు సినిమా పరిధి పెరిగింది. పాన్ ఇండియా ప్రేక్షకుల చూపు మన సినిమా మీద ఉంది. దాంతో దర్శక రచయితల కథలకు కొత్త రెక్కలు వచ్చాయి. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు నచ్చే కథలపై దృష్టి పెట్టారు. ఆ కథలపై నమ్మకం కుదిరితే కోట్లకు ఖర్చు చేయడానికి నిర్మాతలకు ముందుకు వస్తున్నారు. ఆ కోవలోకి వస్తుంది సుమంత్ (Sumanth Latest Theatrical Movie) లేటెస్ట్ సినిమా 'మహేంద్రగిరి వారాహి'. ఈ సినిమా బడ్జెట్, కథ ఇండస్ట్రీలో డిస్కషన్ పాయింట్ అయ్యాయి.
సుమంత్ సినిమా బడ్జెట్ పాతిక కోట్లు
సుమంత్ కథానాయకుడిగా 'మహేంద్రగిరి వారాహి' (Mahendragiri Varahi Movie) అని ఓ సినిమా తెరకెక్కుతోంది. రాజ శ్యామల పతాకంపై సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు అని తెలిసింది.
సుమంత్, దర్శకుడు సంతోష్ జాగర్లపూడి (Santhosh Jagarlapudi) కలిసి ఇంతకు ముందు 'సుబ్రమణ్యపురం' అని ఓ సినిమా చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు సేమ్ హీరో, దర్శకుడు కలిసి మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమాను భారీ ఎత్తున పాతిక కోట్లు ఖర్చు చేస్తూ తీస్తుండటం విశేషం. ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయిలో మైథాలజీ, సోషియో ఫాంటసీ కథలకు ప్రేక్షక ఆదరణ దక్కుతోంది. యువ దర్శకుడు సంతోష్ జాగర్లపూడి అటువంటి కథ రెడీ చేశారట. దీంతో సుమంత్ మరోసారి స్టార్ రేసులోకి ఎంటర్ అవుతారని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.
View this post on Instagram
సోషియో ఫాంటసీ నేపథ్యంలో సూపర్ న్యాచురల్ కథతో 'మహేంద్ర గిరి వారాహి' తీస్తున్నారు. సినిమాలోని మైథాలజీ కాన్సెప్ట్ మీద ప్రొడ్యూసర్ చాలా నమ్మకం పెట్టుకున్నారట. సుమంత్ జర్నీలో 'మహేంద్రగిరి వారాహి' మైలు రాయిగా నిలిచిపోయే సినిమా అవుతుందని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి అన్నారు.
View this post on Instagram
Mahendragiri Varahi Cast: సుమంత్, మీనాక్షి గోసామి జంటగా నటిస్తున్న 'మహేంద్రగిరి వారాహి'లో బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, కమల్ కామరాజు, సత్యసాయి శ్రీనివాస్, వంశీ చాగంటి, మంజు భార్గవి ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడు.























