అన్వేషించండి

TG TET Results 2025: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్‌ డైరెక్ట్ లింక్ ఇదే!

TG TET Results 2025: జనవరిలో జరిగిన తెలంగాణ టెట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మున్సిపాలిటీ ఎన్నికల వేళ ఫలితాలు ఆలస్యమవుతాయని ‌అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణ టెట్ ఫలితాలు పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.
  • 2,37,754 మంది దరఖాస్తు చేసుకోగా, 1,95,181 మంది పరీక్ష రాశారు.
  • ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది.
  • జనవరి 3-20 మధ్య పరీక్షలు, ఫిబ్రవరి 10న ఫలితాలు విడుదలయ్యాయి.

TG TET Results 2025: తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిని ఆశించే వేల మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్ష ఫలితాలను, అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను విద్యాశాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఉపాధ్యాయ నియామకాల్లో కీలకమైన ఈ పరీక్షా ఫలితాల కోసం అభ్యర్థులు గత కొన్ని రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఫలితాలు ఎలా చూసుకోవాలి? 

టెట్‌కు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను పాఠశాల విద్యాశాఖకు చెందిన అధికారిక వెబ్‌సైట్‌  https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/లో చూసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన తర్వాత అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి తమ మార్కులను జాబితాను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

ఈ ఏడాది నిర్వహించిన టెట్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,37, 754 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,95, 181 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 82 శాతం మంది అభ్యర్థులు తమ అధృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ లెక్కలు చూస్తే గతంతో పోలిస్తే అభ్యర్థుల హాజరు శాతం పెరిగిందని విద్యాశాఖ చెబుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువు సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ పడ్డారు. 

ఈసారి టెట్‌ పరీక్షలో ఇప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సర్వీస్ టీచర్స్ కూడా హాజరయ్యారు. ఇన్‌సర్వీస్‌లో ఉన్న వాళ్లకి కూడా టెట్ తప్పనిసరి చేయడంలో వాళ్లంతా పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇన్‌సర్వీస్ టీచర్లు రికార్డుల స్థాయిలో 90 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. 

టెట్ పరీక్షలు జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 20న ముగిశాయి. పరీక్షలు ముగిసిన తర్వాత ఫలితాలు విడుదల కూడా ఫిబ్రవరి 10- 16 మధ్య విడుదల చేయాలని అధికారులు ముందుగానే నిర్ణయించారు. ఆ లెక్క ప్రకారం పదో తేదీనే ఫలితాలు ప్రకటించారు. 

టెట్ అర్హత ప్రాధాన్యం ఇదే 

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయాలంటే టెట్ అర్హత సాధించడం తప్పనిసరి. టెట్‌లో సాధించిన మార్కలకు ఉపాధ్యాయ నియామకాల్లో ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి కేవలం అర్హత సాధించడమే కాకుండా, మెరుగైన స్కోరు సాధించడం అభ్యర్థుల భవిష్యత్‌కు అత్యంత కీలకం. 

ప్రస్తుతం విడుదలైన ఫలితాలు ఆధారంగా అర్హత సాధించిన వారు తదుపరి వచ్చే ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ల కోసం సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఫలితాల్లో ఏవైనా సాంకేతిక లోపాలు ఉంటే లేదా మార్కుల విషయంోల సందేహాలు ఉంటే అభ్యర్థులు విద్యాశాఖ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు. 

Frequently Asked Questions

TG TET ఫలితాలను ఎక్కడ చూసుకోవచ్చు?

TG TET ఫలితాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌  https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ లో చూసుకోవచ్చు. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి, హాల్‌టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది.

ఈ ఏడాది TG TET పరీక్షకు ఎంత మంది హాజరయ్యారు?

ఈ ఏడాది TG TET పరీక్షకు మొత్తం 1,95, 181 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇది సుమారు 82 శాతం హాజరు శాతం.

TG TET అర్హత సాధించడం ఉపాధ్యాయ నియామకాలకు ఎంత ముఖ్యం?

తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయడానికి TG TET అర్హత తప్పనిసరి. టెట్‌లో సాధించిన మార్కులకు నియామకాల్లో 20% వెయిటేజ్ ఉంటుంది.

ఫలితాల్లో ఏవైనా సందేహాలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?

ఫలితాల్లో సాంకేతిక లోపాలు లేదా మార్కుల విషయంలో సందేహాలు ఉంటే, అభ్యర్థులు విద్యాశాఖ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
RRB JE Posts 2026: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు
RRB JE Posts: రైల్వేలో 3,993 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ముఖ్యమైన తేదీలు, అభ్యర్థుల అర్హతలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget