News
News
X

Nokia XR20: నోకియా రగ్డ్ ఫోన్ సేల్ ప్రారంభం.. నేల మీద పడ్డా, నీళ్లలోకి వెళ్లినా ఏమీ కాదు

నోకియా మనదేశంలో ఇటీవలే లాంచ్ చేసిన ఎక్స్ఆర్20 సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

FOLLOW US: 
Share:

నోకియా ఎక్స్ఆర్20 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో మిలటరీ గ్రేడ్ డిజైన్‌ను కంపెనీ అందించింది. 1.8 మీటర్ల(దాదాపు ఆరు అడుగులు) ఎత్తు నుంచి కింద పడినా ఏమీ కాదని, గంట సేపు నాన్‌స్టాప్‌గా నీళ్లలో ఉంచినా ఏమీ కాదని నోకియా అంటోంది. మూడు సంవత్సరాల వరకు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్, నాలుగు సంవత్సరాల వరకు నెలవారీ సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని కంపెనీ భరోసా ఇచ్చింది. ఇందులో 5జీ కూడా అందించారు.

నోకియా ఎక్స్ఆర్20 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధర రూ.46,999గా ఉంది. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలు, నోకియా.కాం వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి రూ.3,599 విలువైన నోకియా పవర్ ఇయర్‌బడ్స్ లైట్ ఉచితంగా లభించనున్నాయి. దీంతో పాటు వన్ ఇయర్ స్క్రీన్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా నోకియా అందించనుంది.

నోకియా ఎక్స్ఆర్20 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కూడా ఇందులో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్‌డీకార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 11 స్టాక్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4630 ఎంఏహెచ్‌గా ఉంది. 18W వైర్డ్ చార్జింగ్, 15W వైర్‌లెస్ చార్జింగ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్/నావిక్, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 1.06 సెంటీమీటర్లు కాగా, బరువు 248 గ్రాములుగా ఉంది.

కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ అందించారు. MIL-STD810H సర్టిఫికేషన్ కూడా ఇందులో ఉంది. ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ఇందులో అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారో మీటర్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉండనున్నాయి.

Also Read: Apple Macbook Pro(2021): కొత్త మ్యాక్‌బుక్ ప్రోల సేల్ వాయిదా.. ఎప్పుడు కొనేయచ్చంటే?

Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 31 Oct 2021 08:29 PM (IST) Tags: Nokia New Phone Nokia Nokia XR20 Price in India Nokia XR20 Nokia Rugged Phone Nokia XR20 Specifications Nokia XR20 Features Nokia XR20 Sale in India

సంబంధిత కథనాలు

ChatGPT vs Bard: చాట్ జీపీటీకి పోటీగా బార్డ్‌ను తీసుకొస్తున్న గూగుల్ - రెండిటికీ తేడా ఏమిటీ?

ChatGPT vs Bard: చాట్ జీపీటీకి పోటీగా బార్డ్‌ను తీసుకొస్తున్న గూగుల్ - రెండిటికీ తేడా ఏమిటీ?

Smartphones Under 15000: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - అన్ని ఫీచర్లు అదుర్స్!

Smartphones Under 15000: రూ.15,000 లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - అన్ని ఫీచర్లు అదుర్స్!

Google Chrome Extensions: మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఈ 8 ఎక్స్‌టెన్సన్స్‌‌తో బోలెడంత టైమ్ సేవ్ చేయొచ్చు!

Google Chrome Extensions: మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఈ 8 ఎక్స్‌టెన్సన్స్‌‌తో బోలెడంత టైమ్ సేవ్ చేయొచ్చు!

Twitter Gold: గోల్డ్ టిక్‌కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!

Twitter Gold: గోల్డ్ టిక్‌కు నెలకు రూ.82 వేలు - మరో కొత్త స్కీమ్‌తో రానున్న మస్క్!

ChatGPT Rival: గూగుల్‌పై చాట్‌జీపీటీ ఎఫెక్ట్ - ఇకపై తామూ ఆ సేవలు అందిస్తామంటున్న సుందర్ పిచాయ్!

ChatGPT Rival: గూగుల్‌పై చాట్‌జీపీటీ ఎఫెక్ట్ - ఇకపై తామూ ఆ సేవలు అందిస్తామంటున్న సుందర్ పిచాయ్!

టాప్ స్టోరీస్

MLC Kavitha: ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత - 2024 ఎన్నికల చర్చకు హాజరు!

MLC Kavitha: ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత - 2024 ఎన్నికల చర్చకు హాజరు!

Kadiyam Srihari On Sharmila: జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !

Kadiyam Srihari On Sharmila:   జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !

Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!

Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!

YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన

YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన