By: ABP Desam | Updated at : 16 Feb 2023 05:38 PM (IST)
నోకియా ఎక్స్30 5జీ లాంచ్ అయింది.
Nokia X30 5G: నోకియా పేరెంట్ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్ భారతదేశంలో కొత్త ఎక్స్-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అదే నోకియా X30 5జీ. గతేడాది అక్టోబర్‌లో కంపెనీ ఈ ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఇప్పుడు సుమారు ఐదు నెలల తర్వాత కంపెనీ ఈ డివైస్‌ను భారతదేశంలో ప్రవేశపెట్టింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది.
ఈ ఫోన్‌ను ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫోన్ ధరను రూ.48,999గా నిర్ణయించారు. ఫోన్ ఫీచర్లకు ధరకు అస్సలు సంబంధం లేదని విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనదేశంలో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో ఉన్న ఫోన్ల ధర రూ.25 వేలలోపే ఉంది. మహా అయితే రూ.30 వేల వరకు పెట్టవచ్చు. రూ.50 వేల రేంజ్‌లో ఉండే టాప్ ఎండ్ ఫోన్‌లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ సిరీస్ ప్రాసెసర్లను అందిస్తున్నారు. దీంతో వినియోగదారులు నోకియాపై విరుచుకుపడుతున్నారు.
Nokia X30 5G ధర
నోకియా X30 5G భారతదేశంలో ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది. ఇందులో 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ అందించారు. దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్ కూడా ప్రారంభం అయింది. క్లౌడీ బ్లూ, ఐస్ వైట్ కలర్ వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫోన్ ధర రూ.48,999. ఫోన్‌పై ప్రీ-లాంచ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
హెచ్ఎండీ గ్లోబల్ ఈ ఫోన్‌పై రూ.6,500 విలువైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ డివైస్‌ను ప్రీ-బుక్ చేసే కస్టమర్‌లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1,000 తగ్గింపు, రూ. 2,799 విలువైన నోకియా కంఫర్ట్ ఇయర్‌బడ్స్, రూ. 2,999 విలువైన 33W ఛార్జర్ అందించనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ షిప్పింగ్ ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
నోకియా ఎక్స్30 5జీ ఫోన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి Amazon, Nokia.comలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా కంపెనీ అమెజాన్ ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులందరికీ 33W నోకియా ఫాస్ట్ వాల్ ఛార్జర్‌ను ఉచితంగా అందజేస్తుంది. ఇది కాకుండా ఎక్స్‌చేంజ్‌పై రూ. 4,000 తగ్గింపును లభించనుంది.
Nokia X30 5G స్పెసిఫికేషన్లు
డిస్ ప్లే: 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఇందులో ఉంది. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 x 2400 పిక్సెల్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది.
రిఫ్రెష్ రేట్: 90Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్
బ్రైట్‌నెస్: 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్: Qualcomm Snapdragon 695 5G ప్రాసెసర్
ర్యామ్, స్టోరేజ్: 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 12 మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ది బాక్స్
కనెక్టివిటీ: బ్లూటూత్ వీ5.1, ఎలక్ట్రానిక్ సిమ్, యూఎస్‌బీ టైప్-సీ (యూఎస్‌బీ 2.0), డ్యూయల్-బ్యాండ్ వైఫై
ఛార్జింగ్: 33W ఛార్జర్
బ్యాటరీ: 4,200 ఎంఏహెచ్ బ్యాటరీ
నోకియా X30 5G కెమెరా
ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ కోసం DX+ సపోర్ట్ ఉన్న 50 మెగాపిక్సెల్ ప్యూర్‌వ్యూ OIS కెమెరా, 123-డిగ్రీ ఫీల్డ్ వ్యూతో 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అందుబాటులో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో వస్తుంది. హెచ్ఎండీ గ్లోబల్ ఈ స్మార్ట్‌ఫోన్ కోసం మూడేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌గ్రేడ్‌ను అందించనున్నారు.
C12 Budget Smartphone: నోకియా నుంచి రూ.6 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్, ఫీచర్లు కూడా అదుర్స్
iPhone 15 Pro Max: యాపిల్ కొత్త సిరీస్‌లో సూపర్ ఫీచర్ - శాంసంగ్, షావోమీ ఫోన్లను మించేలా?
Second Hand Smartphone: సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే!
Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!
Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?
AP News: మహిళా ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకోవచ్చని వెల్లడి
వడగళ్ల వానతో నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం కేసీఆర్
CM Jagan : ఓ స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ స్కిల్ డెవలప్మెంట్, దేశంలోనే అతి పెద్ద కుంభకోణం - సీఎం జగన్
Kota Srinivasa Rao : డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు - మరణ వార్తపై కోట శ్రీనివాస రావు సీరియస్