Nokia G11: రూ.10 వేలలోనే నోకియా కొత్త ఫోన్ - మరి ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా మనదేశంలో జీ11 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది.దీని ధర రూ.10 వేల రేంజ్‌లో ఉండనుంది.
నోకియా జీ11 స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఏకంగా మూడు రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందించగలదని కంపెనీ తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో లాంచ్ అయిన నోకియా జీ10కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. 90 హెర్ట్జ్ డిస్‌ప్లేను కూడా ఇందులో అందించారు. వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే ఇందులో ఉంది.
నోకియా జీ11 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 499 ఆస్ట్రేలియన్ డాలర్లుగా (సుమారు రూ.10,200) నిర్ణయించారు. చార్‌కోల్, ఐస్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దుబాయ్, యూకే మార్కెట్లలో మార్చి నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.
నోకియా జీ11 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ ఉంది. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. 3 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
4జీ ఎల్టీఈ, వైఫై, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎఫ్ఎం రేడియో, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5050 ఎంఏహెచ్‌గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.85 సెంటీమీటర్లు కాగా... బరువు 189 గ్రాములుగా ఉంది.
View this post on Instagram